Share News

Bihar snake bite: మూడు పాములతో హాస్పిటల్‌కు.. అసలేం జరిగిందో తెలిస్తే షాకవ్వాల్సిందే..

ABN , Publish Date - Jan 12 , 2026 | 07:10 AM

బీహార్‌లోని ససారాంలో పాములు పట్టే ఓ వ్యక్తి మూడు నాగుపాములతో హాస్పిటల్ సిబ్బందికి షాకిచ్చాడు. అతడు తీసుకొచ్చిన పాములను చూసి అందరూ హడలి పోయారు. అయితే అతడు చెప్పిన విషయం తెలుసుకుని ఉపశమనం పొందారు.

Bihar snake bite: మూడు పాములతో హాస్పిటల్‌కు.. అసలేం జరిగిందో తెలిస్తే షాకవ్వాల్సిందే..
Bihar snake bite news

బీహార్‌లోని ససారాంలో పాములు పట్టే ఓ వ్యక్తి మూడు నాగుపాములతో హాస్పిటల్ సిబ్బందికి షాకిచ్చాడు. అతడు తీసుకొచ్చిన పాములను చూసి అందరూ హడలి పోయారు. అయితే అతడు చెప్పిన విషయం తెలుసుకుని ఉపశమనం పొందారు. రాజ్‌పూర్‌కు చెందిన పాములు పట్టే నిపుణుడైన గౌతమ్ కుమార్ శనివారం గ్రామంలోకి ప్రవేశించిన మూడు నాగుపాములను పట్టుకున్నాడు (man brings cobras to hospital


ఆ పాములను సంచిలో వేసుకుని వాటిని అడవిలో వదిలెయ్యడానికి బయల్దేరాడు. అడవిలో వాటిని సంచిలో నుంచి తీసే క్రమంలో ఒక పాము అతడిని కాటేసింది. దీంతో అతడు వెంటనే హాస్పిటల్‌కు వెళ్లాడు. అయితే తనతో పాటు ఆ మూడు పాములను కూడా హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. హాస్పిటల్‌లో సంచిలో నుంచి పాములను బయటకు తియ్యగానే అక్కడున్న డాక్టర్లు, సిబ్బంది పరుగులు పెట్టారు. దాదాపు 10 అడుగుల పొడవున్న మూడు పాములను చూసి అక్కడున్న అందరూ భయపడ్డారు (snake bite treatment Bihar).


తనను కరిచిన పామును డాక్టర్లకు చూపించేందుకు, వాటికి కూడా చికిత్స అందించేందుకే అడవి నుంచి వెనక్కి తీసుకొచ్చినట్టు గౌతమ్ కుమార్ తెలిపాడు (cobra bite case). పాముల గురించి సమాచారం అందినప్పుడల్లా, వాటిని పట్టుకోవడానికి గౌతమ్ కుమార్ ఆ ప్రదేశానికి వెళ్తాడు. వాటిని బంధించి, తరువాత వాటిని సురక్షితంగా అడవిలోకి వదిలివేస్తాడు. కాగా, ప్రస్తుతం గౌతమ్ కుమార్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు.


ఇవి కూడా చదవండి..

బాబా వంగా చెప్పింది నిజమవుతుందా.. మూడో ప్రపంచ యుద్ధం తప్పదా..

రిపబ్లిక్ డే సేల్‌కు రెడీ అవుతున్న అమెజాన్, ఫ్లిప్‌కార్ట్.. ఎప్పటి నుంచంటే..

Updated Date - Jan 12 , 2026 | 08:15 AM