Republic Day Sale 2026: రిపబ్లిక్ డే సేల్‌కు రెడీ అవుతున్న అమెజాన్, ఫ్లిప్‌కార్ట్.. ఎప్పటి నుంచంటే..
ABN , Publish Date - Jan 11 , 2026 | 07:17 AM
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్‌కు సిద్ధమవుతున్నాయి. ఫ్లిప్‌కార్ట్ రెండ్రోజుల క్రితమే రిపబ్లిక్ డే సేల్ తేదీలను ప్రకటించగా, తాజాగా అమెజాన్ కూడా 'గ్రేట్ రిపబ్లిక్ డే సేల్-2026'ను ప్రకటించింది.
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్‌కు సిద్ధమవుతున్నాయి. ఫ్లిప్‌కార్ట్ రెండ్రోజుల క్రితమే రిపబ్లిక్ డే సేల్ తేదీలను ప్రకటించగా, తాజాగా అమెజాన్ కూడా 'గ్రేట్ రిపబ్లిక్ డే సేల్-2026'ను ప్రకటించింది. అమెజాన్‌లో రిపబ్లిక్ డే సేల్ జనవరి 16వ తేదీన ప్రారంభం కాబోతోంది. ఈ సేల్‌లో భాగంగా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్, ఈఎంఐ లావాదేవీలపై పది శాతం డిస్కౌంట్ లభించనుందని అమెజాన్ ఓ ప్రకటనలో తెలిపింది (Amazon Republic Day deals).
ఈ డీల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు, పీసీలు, స్మార్ట్‌గ్లాసెస్, వాషింగ్ మెషిన్లు, స్మార్ట్ టీవీలు, ప్రొజెక్టర్లపై ఆఫర్లు లభించనున్నాయి. డీల్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే బయటకు రాబోతున్నాయి. ఇప్పటికే అమెజాన్ యాప్‌లో కొన్ని డీల్స్‌కు సంబంధించిన ప్రకటనలు కనబడుతున్నాయి (India Republic Day discounts).
మరోవైపు ఫ్లిప్‌కార్ట్ జనవరి 17వ తేదీ నుంచి రిపబ్లిక్ డే సేల్‌ను ప్రారంభించనుంది (Flipkart 26 January sale). అయితే, ఫ్లిప్‌కార్ట్ ప్లస్, ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ సభ్యత్వాలు కలిగిన కస్టమర్లకు 24 గంటల ముందుగానే సేల్ ఈవెంట్‌కు యాక్సెస్ లభిస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు 10 శాతం తక్షణ డిస్కౌంట్‌తో పాటు సులభమైన ఈఎంఐ ఆప్షన్లను అందిస్తామని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. అంతేకాకుండా, ఎంపిక చేసిన బ్యాంకుల డెబిట్, క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేసే వారికి 15 శాతం వరకు తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. వివిధ స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రిక్ గాడ్జెట్స్‌పై భారీ డిస్కౌంట్ ఉండనున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి..
ఐఏఎస్ అధికారిపై తప్పుడు కథనం.. ఐఏఎస్ సంఘం రియాక్షన్ ఇదే..
ప్రజలకు తెలంగాణ డ్రగ్ కంట్రోల్ కీలక హెచ్చరికలు..
Read Latest Telangana News And Telugu News