Telangana IAS: ఐఏఎస్ అధికారిపై తప్పుడు కథనం.. ఐఏఎస్ సంఘం రియాక్షన్ ఇదే..
ABN , Publish Date - Jan 10 , 2026 | 11:06 AM
మహిళా ఐఏఎస్ అధికారిపై తప్పుడు కథనాలు ప్రసారమవడంపై తెలంగాణ ఐఏఎస్ సంఘం స్పందించింది. మహిళా ఐఏఎస్‌పై ప్రచారం చేస్తున్న తప్పుడు కథనాన్ని తక్షణమే అన్ని ప్లాట్‌ఫామ్‌ల నుంచి తొలగించాలని హెచ్చరించింది..
హైదరాబాద్, జనవరి 10: మహిళా ఐఏఎస్ అధికారిపై వస్తున్న తప్పుడు కథనాలను తెలంగాణ ఐఏఎస్ అధికారుల అసోసియేషన్ (IAS Officers Association) తీవ్రంగా ఖండించింది. తప్పుడు కథనాలు ప్రసారం చేసిన మీడియా సంస్థలపై ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళా ఐఏఎస్‌పై ప్రచారం చేస్తున్న తప్పుడు కథనాన్ని తక్షణమే అన్ని ప్లాట్‌ఫామ్స్ నుంచి తొలగించాలని హెచ్చరించింది. లేనిపక్షంలో సదరు మీడియా హౌజ్‌పై న్యాయపరంగా ముందుకు వెళ్తామని వార్నింగ్ ఇచ్చింది. బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. అసత్య ప్రచారాలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఐఏఎస్ అధికారుల అసోసియేషన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.
కాగా.. ఇటీవల మంత్రికి, ఓ మహిళా ఐఏఎస్ అధికారికి మధ్య ప్రేమాయణం అంటూ ఓ మీడియా సంస్థలో కథనం ప్రసారమవడం తెలంగాణలో రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. సదరు మహిళా అధికారికి మంత్రి ప్రత్యేకంగా పోస్టింగ్‌లు ఇప్పిచ్చారంటూ జోరుగా ప్రచారం జరిగింది. మీడియా సంస్థ ప్రసారం చేసిన కథనం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ కథనంపై తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం స్పందిస్తూ.. సదరు మీడియా సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కథనం వల్ల ఐఏఎస్ అధికారి పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించడం సరికాదని పేర్కొంది. ఇలాంటి నైతికత లేని జర్నలిజం.. సివిల్ సర్వీస్ అధికారులతో పాటూ సమాజానికి చెడ్డ పేరు తెస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి ఐఏఎస్ అధికారికి వెంటనే క్షమాపణ చెప్పాలని తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం డిమాండ్ చేసింది.
ఇవి కూడా చదవండి..
చైనా మాంజా విక్రయాలపై ‘స్పెషల్’ డ్రైవ్
దారుణం.. యువకుడిని అతి కిరాతకంగా..
Read Latest Telangana News And Telugu News