Home » IAS
ఐఏఎస్ అధికారి మంజులే బాలాజీ దిగంబర్‌ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనకు స్థానచలనం కల్పించింది. స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అదనపు డైరెక్టర్‌గా పనిచేస్తున్న బాలాజీ దిగంబర్‌ను రాష్ట్ర సర్కార్ బదిలీ చేసింది.
దురుసు స్వభావానికి పెట్టింది పేరైన సీఎంవోలోని సీనియర్ ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రా మరోసారి తన విశ్వరూపం చూపారు. గతంలో గన్నవరం విమానాశ్రయంలో కృష్ణా జిల్లా కలెక్టర్‌ను నీచ పదజాలంతో దూషించి, ఏకంగా షూను బహుమతిగా పంపిన ఘటనను మరవక ముందే, తాజాగా సీఎం క్యాంపు కార్యాలయంలో సాక్షాత్తూ తన సహచర ఐఏఎస్ అధికారిపైనే దూషణల పర్వానికి దిగారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనా వ్యవస్థలో కీలక మార్పులు చేపట్టింది. ఏకంగా 22 మంది ఐఏఎస్ ఆఫీసర్లను బదిలీ చేస్తూ కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువ ఐఏఎస్ అధికారి రింకూ సింగ్ రాహీ తనకు సగం జీతమే చెల్లించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించడం చర్చనీయాంశంగా మారింది.
ఉత్తర్ ప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో నకిలీ ఐఏఎస్ ఉన్నతాధికారిణిగా నటించి ఓ మహిళ.. యువకుడిని మోసం చేసింది. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది
ఏపీ ఆరోగ్య శాఖకు అవినీతి క్యాన్సర్ పేరుతో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వరుస కథనాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది.
దేశంలో రిజర్వేషన్ల ఫలాలు అందుకొని సామాజికంగా, ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరిన కుటుంబాలు.. తరతరాలుగా అదే కోటాను కోరుకోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తల్లిదండ్రులు ఇద్దరూ ఐఏఎస్ అధికారులై, ప్రభుత్వ సర్వీసుల్లో ఉంటూ పూర్తి స్థాయిలో స్థిరపడినప్పుడు, ఇక వారి పిల్లలకు రిజర్వేషన్ల కోటా ఎందుకని ప్రశ్నించింది.
ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న శశి భూషణ్ కుమార్‌కు జలవనరుల శాఖ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని సీనియర్ ఐఏఎస్ అధికారి అహ్మద్ బాబుపై ఏపీ హైకోర్టు నిప్పులు చెరిగింది. ఉద్యోగుల పట్ల రాగద్వేషాలతో వ్యవహరించే వ్యక్తి ఐఏఎస్ అధికారిగా కొనసాగడానికి వీల్లేదంది. చట్టం అన్నా, కోర్టు ఉత్తర్వులన్నా ఆయనకు గౌరవం లేదని మండిపడింది.
తెలంగాణ ఐఏఎస్ అధికారి రజత్ కుమార్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలకు సంబంధించి ఢిల్లీ హైకోర్టులో కీలక విచారణ జరిగింది. ఐఏఎస్ అధికారిపై వచ్చిన ఫిర్యాదును మూడు నెలల్లోగా తేల్చాలని కేంద్రాన్ని ఆదేశించింది.