Share News

RV Karnan: వచ్చే మార్చి నాటికి స్టీల్‌బ్రిడ్జి పనులు పూర్తి చేస్తాం

ABN , Publish Date - Aug 13 , 2025 | 08:17 AM

మలక్‌పేటలోని నల్గొండ చౌరస్తా నుంచి ఓవైసీ జంక్షన్‌ వరకు నిర్మిస్తున్న స్టీల్‌బ్రిడ్జి నిర్మాణ పనులను వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేస్తామని గ్రేటర్‌ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌ ప్రకటించారు. స్టీల్‌బ్రిడ్జి నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు.

RV Karnan: వచ్చే మార్చి నాటికి స్టీల్‌బ్రిడ్జి పనులు పూర్తి చేస్తాం

హైదరాబాద్: మలక్‌పేటలోని నల్గొండ చౌరస్తా నుంచి ఓవైసీ జంక్షన్‌ వరకు నిర్మిస్తున్న స్టీల్‌బ్రిడ్జి నిర్మాణ పనులను వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేస్తామని గ్రేటర్‌ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌(Greater Commissioner RV Karnan) ప్రకటించారు. స్టీల్‌బ్రిడ్జి నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్‌ బలాల, చార్మినార్‌ జడ్‌సీ వెంకన్నలతో కలిసి 2.58కి.మీ. పొడవైన స్టీల్‌బ్రిడ్జి నిర్మాణ పనుల పురోగతిని కమిషనర్‌ పరిశీలించారు.


చంచల్‌గూడ ప్రభుత్వ ప్రింటింగ్‌ ప్రెస్‌ నుంచి సైదాబాద్‌, ఐఎస్‌ సదన్‌ మీదుగా యాదగిరి థియేటర్‌ వరకు సాగనున్న ఈ బ్రిడ్జి నిర్మాణానికి రూ.620కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నట్లు కమిషనర్‌ వివరించారు. అనంతరం ప్రాజెక్ట్‌ ఇంజనీర్లు మాట్లాడుతూ మార్చిలోగా పనులు పూర్తి చేస్తామని కమిషనర్‌, ఎమ్మెల్యేకు తెలిపారు.

city4.jpg


మలక్‌పేట ఆర్‌యూబీ వద్ద వరద సమస్యపై కమిషనర్‌ ఆరా

వర్షం కురిసినప్పుడల్లా మలక్‌పేట ఆర్‌యూబీ(Malakpet RUB) వద్ద తలెత్తుతున్న వరదనీరు నిల్వ సమస్యలపై కమిషనర్‌ కర్ణన్‌ ఆరా తీశారు. దీనికి ప్రత్యామ్నాయంగా డ్రైనేజీ మార్గాలను పరిశీలించి ప్రతిపాదనలు తయారు చేయాలని ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. అలాగే డబీరపుర ప్రాంతంలోని ఓపెన్‌ నాలాలను పరిశీలించారు. క్షేత్రస్థాయి పరిశీలనలో మలక్‌పేట సర్కిల్‌-6 డీసీ ఎంకేఐ అలీ, ఈఈ పీర్‌సింగ్‌, ప్రాజెక్ట్‌ ఈఈ గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మరుగుదొడ్డిలో 16 అడుగుల కింగ్‌ కోబ్రా

నేడు దేశంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Read Latest Telangana News and National News

Updated Date - Aug 13 , 2025 | 08:17 AM