Manyam District: మరుగుదొడ్డిలో 16 అడుగుల కింగ్ కోబ్రా
ABN , Publish Date - Aug 13 , 2025 | 06:24 AM
పార్వతీపురం మన్యం జిల్లా... కురుపాం మండలం కిచ్చాడ గ్రామంలో మంగళవారం ఓ ఇంటి పెరటిలోని మరుగుదొడ్డిలో కింగ్‌కోబ్రా కనిపించింది.
కురుపాం/కురుపాం రూరల్, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మన్యం జిల్లా... కురుపాం మండలం కిచ్చాడ గ్రామంలో మంగళవారం ఓ ఇంటి పెరటిలోని మరుగుదొడ్డిలో కింగ్‌కోబ్రా కనిపించింది. దీంతో ఆ కుటుంబ సభ్యులు, గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటవీశాఖాధికారులకు సమాచారం అందించారు. దీంతో కురుపాం ఫారెస్ట్ రేంజర్ గంగరాజు విశాఖపట్నం నుంచి వన్యప్రాణుల సంరక్షణ సభ్యులను రప్పించారు. తూర్పు కనుమ వన్యప్రాణి సంరక్షణ సభ్యుడు కంటిమహంతి మూర్తి ఆధ్వర్యంలో ముగ్గురు ఫారెస్ట్ సిబ్బంది చాకచక్యంగా కింగ్ కోబ్రాను పట్టుకుని.. సమీప అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. ఈ విష సర్పం సుమారు 16 అడుగులు ఉంటుందని వారు తెలిపారు.