Collector Harichandan: వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - Sep 27 , 2025 | 09:28 AM
నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హరిచంద సూచించారు. ప్రధానంగా లోతట్టు, మూసీ పరీవాహక ప్రాంతాల్లో వర్షాల తీవ్రతను గమనించి సురక్షిత స్థలాలకు తరలివెళ్లాలని పేర్కొన్నారు.
హైదరాబాద్ సిటీ: నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హరిచందన(Collector Harichandan) సూచించారు. ప్రధానంగా లోతట్టు, మూసీ పరీవాహక ప్రాంతాల్లో వర్షాల తీవ్రతను గమనించి సురక్షిత స్థలాలకు తరలివెళ్లాలని పేర్కొన్నారు. రసూల్‌పురాలోని ప్యాట్నీ నాలాను శుక్రవారం కలెక్టర్ సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ...

లోతట్టు ప్రాంతాలు, మూసీ పరీవాహకంలో రెస్క్యూ టీమ్స్, రెవెన్యూ అధికారులు(Rescue teams and revenue officials) నిరంతరం పర్యవేక్షణ చేయాలన్నారు. ఇళ్లలోకి వరద వచ్చినా, ఇతర సమస్యలు ఉత్పన్నమైతే ప్రజలు వెంటనే కలెక్టరేట్‌లోని హెల్ప్‌లైన్ నంబరు 9063423979కు ఫోన్‌చేసి సాయం పొందాలని సూచించారు. కలెక్టర్ వెంట సికింద్రాబాద్ ఆర్డీఓ సాయిరాం, తహసీల్దార్ పాండునాయక్, అధికారులు ఉన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..
పసిడి ధరల్లో స్వల్ప పెరుగుదల! నేటి రేట్స్ ఇవే..
ట్రిపుల్ ఆర్ బాధితుల ఆరోపణలు నిజమే
Read Latest Telangana News and National News
