MLA Rajagopal Reddy: ట్రిపుల్ ఆర్ బాధితుల ఆరోపణలు నిజమే
ABN , Publish Date - Sep 27 , 2025 | 04:16 AM
ప్రముఖ కంపెనీలతో పాటు ధనిక వర్గాల భూములను కాపాడేందుకే ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్ మార్చారన్న బాధితుల ఆరోపణలు నిజమేనని మునుగోడు...
సీఎంతో మాట్లాడి బాధితులకు న్యాయం చేస్తా
ప్రముఖ కంపెనీల కోసమే అలైన్‌మెంట్ మార్పు
బాధితుల పక్షాన ఉంటానన్న ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి
మునుగోడు, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): ప్రముఖ కంపెనీలతో పాటు ధనిక వర్గాల భూములను కాపాడేందుకే ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్ మార్చారన్న బాధితుల ఆరోపణలు నిజమేనని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి చెప్పారు. రీజనల్ రింగ్ రోడ్డు భూనిర్వాసితుల పక్షాన నిలబడతానన్నారు. ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ భాగంలో భూములు కోల్పోతున్న మునుగోడు నియోజకవర్గ పరిధిలోని చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం, గట్టుప్పల్, మర్రిగూడెం మండలాల భూనిర్వాసితులు రాజగోపాల్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార పార్టీలో ఉన్నా పదవి కంటే బాధ్యత ముఖ్యమని, ప్రజల పక్షాన ఉంటానని స్పష్టం చేశారు. ట్రిపుల్‌ఆర్ ఏర్పాటు చేసే ప్రాంత పరిధిలోని నియోజకవర్గ ఎమ్మెల్యేలందరితో కలిసి వెళ్లి ముఖ్యమంత్రితో మాట్లాడి బాధిత వర్గాలకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.