Share News

Chinese manja: చైనా మాంజా విక్రయాలపై ‘స్పెషల్‌’ డ్రైవ్‌

ABN , Publish Date - Jan 10 , 2026 | 09:52 AM

హైదరాబాద్ నగరంలో చైనా మాంజా విక్రయాలపై ‘స్పెషల్‌’ డ్రైవ్‌ నిర్వహాస్తున్నారు. ప్రాణాంతకరంగా మారిన ఈ చైనా మాంజాపై నిషేదం ఉన్నా.. కొందరు దుకాణదారులు గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్నారు. కాగా.. పోలీసులు దుకాణాల్లో తనిఖీలు నిర్వహిస్తూ విక్రయించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు.

Chinese manja: చైనా మాంజా విక్రయాలపై ‘స్పెషల్‌’ డ్రైవ్‌

- విక్రయదారులపై కఠిన చర్యలు

- హెచ్చరించిన సైబరాబాద్‌ పోలీసులు

హైదరాబాద్‌ సిటీ: చైనా మాంజా(Chinese manja)ల విక్రయాలపై సైబరాబాద్‌ పోలీసులు స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టారు. కమిషనరేట్‌ పరిధిలో ఉన్న మియాపూర్‌, చందానగర్‌ ప్రధాన రహదారి, మాదాపూర్‌, హైటెక్‌ సిటీ, కూకట్‌పల్లి, గచ్చిబౌలి(Madhapur, Hitech City, Kukatpally, Gachibowli) వంటి ప్రాంతాల్లో ఇటీవల ద్విచక్ర వాహనదారుల మెడలకు ఈ మాంజా చిక్కుకొని తీవ్ర గాయాలపాలైన ఘటనలున్నాయి. బాలానగర్‌ రహదారిపై ద్విచక్ర వాహనదారుడి మెడకు దారం తగిలి తీవ్ర గాయమైంది.


అపార్టుమెంట్లు, మేడలపై నుంచి గాలిపటాలు ఎగరవేయగా చెట్ల కొమ్మలకు, విద్యుత్‌ తీగలకు చిక్కి రోడ్డుపై వేలాడటం కారణంగా ప్రమాదాలకు దారి తీస్తోంది. నైలాన్‌, సింథటిక్‌ ఫైబర్‌తో తయారవడంతో పాటు గాజుపొడి, లోహచూర్ణం పూత ఉండటంతో అత్యంత పదునుగా, ప్రమాదకరంగా మారుతోంది. సంకాంత్రి పండగ సమీపిస్తుండగా నగరంలో గాలి పటాలు, చైనా మాంజాల కొనుగోళ్లు పెరిగాయి. సైబరాబాద్‌ పరిధిలో ఉన్న షాపులను తనిఖీ చేసి చైనా మాంజా విక్రయాలను గుర్తిస్తున్నారు.


మూగజీవాలకూ ముప్పే...

మనుషులకే కాదు పక్షులు, ఇతర జీవాలకూ ప్రమాదం. వాటి రెక్కలకు దారాలు చిక్కుకొని ఎగరలేక మృతిచెందుతున్నాయి. వీధి కుక్కలు, పశువుల కాళ్లకు దారాలు చుట్టుకుని గాయాలవుతున్నాయి. గత ఏడాది సైబరాబాద్‌లో చైనామాంజా విక్రయదారులపై 53 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం వ్యాపారులపై కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.


city5.2.jpg

పోలీసుల సూచనలు

- చైనా మాంజా, నైలాన్‌, గాజు లేదా మెటల్‌ కోటింగ్‌ ఉన్న మాంజాను అమ్మవద్దు, కొనవద్దు. కాటన్‌ దారాలనే ఉపయోగించాలి.

- దీని విక్రయం, నిల్వ, రవాణా చట్టవిరుద్ధం.

- ఇంటి పైకప్పులు, టెర్ర్‌సలపై గాలిపటాలు ఎగరవేసేటప్పుడు అదనపు జాగ్రత్తలు తప్పనిసరి.

- రోడ్లు, ప్రధాన రహదారులు, ట్రాఫిక్‌ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో గాలిపటాలు ఎగరవేయకూడదు.


- విద్యుత్‌ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, సెల్‌ టవర్ల సమీపంలో గాలిపటాలు ఎగరవేయడం ప్రమాదకరం.

- ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలి. తద్వారా ప్రమాదాలను కొంతవరకు నివారణ.

- రోడ్డుపై వేలాడుతున్న గాలిపటాల దారాలు కనిపిస్తే జీహెచ్‌ఎంసీ అధికారులకు సమాచారం ఇవ్వాలి.


ఈ వార్తలు కూడా చదవండి.

ప్రతి ఏటా పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌

దావోస్‌‌లో తెలంగాణ రైజింగ్‌

Read Latest Telangana News and National News

Updated Date - Jan 10 , 2026 | 09:52 AM