Share News

Shamshabad: దారుణం.. యువకుడిని అతి కిరాతకంగా..

ABN , Publish Date - Jan 10 , 2026 | 10:37 AM

శంషాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడిని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అతి కిరాతకంగా హత్య చేశారు..

Shamshabad: దారుణం.. యువకుడిని అతి కిరాతకంగా..
Shamshabad

రంగారెడ్డి, జనవరి 10: జిల్లాలోని శంషాబాద్ జీహెచ్‌ఎంసీ పరిధిలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మధురానగర్ స్ట్రీట్ నెంబర్ 3లో యువకుడిని కొందరు గుర్తుతెలియని దుండగులు గొంతుకోసి హత్య చేశారు. ఈ ఘటన స్థానికుల్లో భయాందోళనలు రేకెత్తించింది. గత రాత్రి యువకుడిని అతి కిరాతకంగా హత్య చేసిన దుండగులు పారిపోయారు. సమాచారం అందిన వెంటనే శంషాబాద్ పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


మృతుడు ఎవరనే దానిపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. ఫింగర్ ప్రింట్స్‌తో పాటు ఆ ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే యువకుడిని ఎందుకు హత్య చేశారు?.. వ్యక్తిగత కక్షలా లేక మరే ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా?.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంతంలో పెట్రోలింగ్ పెంచాలని.. ఇలాంటి దారుణాలను అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

నేను ఉన్నంత కాలం చైనా ఆ పని చేస్తుందనుకోను: డొనాల్డ్ ట్రంప్

చైనా మాంజా విక్రయాలపై ‘స్పెషల్‌’ డ్రైవ్‌

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 10 , 2026 | 11:13 AM