Home » Shamshabad
హైదరాబాద్ గచ్చిబౌలికి చెందిన ప్రయాణికురాలిపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నించాడు. ఆమె శంషాబాద్‌కు క్యాబ్‌లో బయలుదేరిన సమయంలో ఈ ఘటనకు పాల్పడ్డాడు.
వినాయక నిమజ్జన ఉత్సవంలో ఉత్సాహంగా పాల్గొని ఇంటికి వస్తుండగా కారు అదుపు తప్పి ఓ కల్వర్టును ఢీకొట్టింది. డ్రైవర్ నిద్రమత్తు, అతివేగం వల్ల జరిగిన ఈ ప్రమాదంలో ఆ కారులో ఉన్న దంపతులు సహా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు. శంషాబాద్‌లోని పాలమాకుల వద్ద కల్వర్టును ఢీకొట్టి ఇన్నోవా కారు బోల్తాపడింది.
రాజీవ్‌గాంధీ ఎయిర్‌పోర్టుకు ఆర్టీసీ పుష్పక్ బస్సుల్లో వెళ్లే ప్రయాణికుల సంఖ్య గతేడాదితో పోల్చితే భారీగా తగ్గింది.
రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ కిషన్‌గూడాలో ట్రావెల్స్ సంస్థకు సంబంధించిన బస్సు బీభత్సం సృష్టించింది. ఈ బస్సు హోటల్లోకి దూసుకెళ్లడంతో ఒకరు మృతి చెందారు.
యూట్యూబర్ నందనను శంషాబాద్ ఎయిర్‌పోర్టు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నందనపై లుక్‌అవుట్ నోటీసులు జారీ కావడంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో తనను గుర్తించారు.
హైదరాబాద్ శంషాబాద్‌లో నకిలీ కరెన్సీ తయారు చేస్తున్న ముఠా గుట్టును శంషాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ఈ వ్యవహారంలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.
శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణించేవారికి ఎయిర్‌పోర్టుల ఆర్థిక వ్యవహారాల నియంత్రణ సంస్థ(ఏఈఆర్‌ఏ) శుభవార్త చెప్పింది.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో వరుస ఘటనలు కలకలం రేపాయి. సౌదీ అరేబియా వెళ్లాల్సిన ఓ ప్రయాణికుడి వద్ద నకిలీ టికెట్‌ను గుర్తించగా.. ఢిల్లీ వెళ్తున్న మరో ప్రయాణికుడి నుంచి బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.
ఇళ్ల కింద గుప్త నిధులు ఉన్నాయంటూ అమాయకులను నమ్మించి మోసగిస్తున్న ఒక ముఠాను రాజేంద్రనగర్ పోలీసుల భాగస్వామ్యంతో శంషాబాద్ జోన్ కమిషనర్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.