Road Accident: ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తుండగా విషాదం.. ఇద్దరి పరిస్థితి విషమం..
ABN , Publish Date - Jan 13 , 2026 | 10:52 AM
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ప్రధాన మార్గంలో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎయిర్ పోర్ట్‌కి వెళ్తున్న ఊబర్ క్యాబ్.. డివైడర్‌ను ఢీకొట్టి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఐదు నెలల గర్భిణితో పాటు ఆమె తల్లికి తీవ్రగాయాలయ్యాయి..
హైదరాబాద్, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ప్రధాన మార్గంలో ఈ రోజు (మంగళవారం) ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తున్న ఊబర్ క్యాబ్.. డివైడర్‌ను ఢీకొని కంట్రోల్ తప్పింది. ఈ ప్రమాదంలో ఐదు నెలల గర్భిణితో పాటు ఆమె తల్లి తీవ్ర గాయాలపాలయ్యారు.
ఘటన వివరాలిలా..
ఈ ప్రమాదం చోటుచేసుకున్న వెంటనే స్థానికులు అంబులెన్స్, పోలీసులకు సమాచారం అందజేశారు. అయితే దాదాపు గంట సమయం వరకు అంబులెన్స్, పోలీస్ సిబ్బంది రాలేకపోవడంతో బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనంతరం, ప్రైవేట్ అంబులెన్స్ ద్వారా క్షతగాత్రులను శంషాబాద్ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స తర్వాత మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రులను హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు.
రోడ్డు ప్రమాదానికి కారణాలు..
పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. కారు డివైడర్‌ను ఢీకొని అదుపు తప్పిందని.. ఇది ప్రమాదానికి ప్రధాన కారణమని వెల్లడించారు. కారు వేగంగా వెళ్లడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ ప్రాంతంలోని సీసీ ఫుటేజీ, ట్రాఫిక్ రిపోర్ట్‌లు, డ్రైవర్ వివరాలు సేకరించడానికి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మాజీ సీఎం రోశయ్య సతీమణి కన్నుమూత..
పోలవరం నల్లమల సాగర్ లింక్‌పై సుప్రీంకోర్టులో కీలక విచారణ
Read Latest Telangana News And Telugu News