Share News

ఆ విమానానికి బాంబు బెదిరింపు.. ఎయిర్‌పోర్టు అధికారుల అలర్ట్

ABN , Publish Date - Feb 15 , 2026 | 09:19 AM

సింగపూర్ నుంచి వచ్చే విమానానికి బాంబు బెదిరింపు రావడంతో.. శంషాబాద్ ఎయిర్ పోర్టు అధికారులు అప్రమత్తమయ్యారు. విమానం సురక్షితంగా ల్యాండ్ కాగానే.. ప్రయాణికులను దింపిన తర్వాత భద్రతా సిబ్బంది తనిఖీలు చేపట్టారు.

ఆ విమానానికి బాంబు బెదిరింపు.. ఎయిర్‌పోర్టు అధికారుల అలర్ట్

హైదరాబాద్, ఫిబ్రవరి 15: సింగపూర్ - హైదరాబాద్ విమానానికి ఈ-మెయిల్‌ ద్వారా బాంబు బెదిరింపు రావడంతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. సదరు విమానం సురక్షితంగా ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యేలా చర్యలు చేపట్టారు. ప్రయాణికులను దింపిన అనంతరం.. ఆ విమానాన్ని ఖాళీ టెర్మినల్ వద్దకు తరలించి తనిఖీలు చేపట్టారు. విమానంలో ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యం కాకపోవడంతో.. ప్రయాణికులతో పాటు ఎయిర్ పోర్ట్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈ బాంబు బెదిరింపు నకిలీదని శంషాబాద్ ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


గతేడాది డిసెంబర్ నుంచి నేటి వరకు అంటే రెండు నెలల వ్యవధిలో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు 23 నకిలీ బెదిరింపు కాల్స్‌ వచ్చాయని అధికారులు వివరించారు. ఈ తరహా ఘటనలకు పాల్పడిన పలువురిని ఇప్పటికే గుర్తించి.. పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. మరికొంత మంది విదేశాల నుంచి ఈ-మెయిల్ ద్వారా ఈ బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు దర్యాప్తులో బహిర్గతమైంది. ఈ బెదిరింపు మెయిల్స్, ఫోన్ కాల్స్ వల్ల సీఐఎస్ఎఫ్, ఎయిర్ పోర్టు పోలీసులకు తలనొప్పిగా మారిందనే ఒక చర్చ సాగుతోంది. ఇక ఈ రోజు అంటే.. ఆదివారం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన బెదిరింపు కాల్.. విదేశాల నుంచి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రాష్ట్ర ప్రజలకు మహా శివరాత్రి శుభాకాంక్షలు చెప్పిన సీఎం చంద్రబాబు

శివరాత్రి వేళ.. ఇలా చేయండి..

For TG News And Telugu News

Updated Date - Feb 15 , 2026 | 09:46 AM