Share News

రాష్ట్ర ప్రజలకు మహా శివరాత్రి శుభాకాంక్షలు చెప్పిన సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Feb 15 , 2026 | 07:48 AM

పరమ పవిత్ర మాసం మాఘమాసం. ఈ మాసంలో వచ్చే చివరి పర్వదినం మహాశివరాత్రి. ఈ నేపథ్యంలో ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.

రాష్ట్ర ప్రజలకు మహా శివరాత్రి శుభాకాంక్షలు చెప్పిన సీఎం చంద్రబాబు
AP CM Chandrababu

అమరావతి, ఫిబ్రవరి 15: మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీశైల జ్యోతిర్లింగ క్షేత్రం కొలువైన పవిత్ర భూమి మన రాష్ట్రంలోనే ఉందని చెప్పారు. భక్త సులభుడైన శివుడు ఈ రోజే లింగాకారంలో ఆవిర్భవించాడని శివపురాణం చెబుతోందని వివరించారు. ఈ పర్వదినాన శివారాధనతో మహాశివుని అనుగ్రహం కలిగి అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నానన్నారు. శివార్చన, జాగరణలతో మహా శివరాత్రిని భక్తిశ్రద్ధలతో జరుపుకుందామని చెప్పారు. పరమశివుని అనుగ్రహంతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు చంద్రబాబు.


మరోవైపు.. రాష్ట్రంలోని అన్ని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివరాత్రి వేళ.. దేవాలయాల వద్ద భక్తులకు ఎలాంటి అసౌర్యం కలగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. శ్రీశైలం, మహానంది, పంచరామ క్షేత్రాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టారు. అలాగే రోడ్డు రవాణ సంస్థ శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడుపుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

జగిత్యాలలో కుర్చీ జగడం!

శివరాత్రి వేళ.. ఇలా చేయండి..

For TG News And Telugu News

Updated Date - Feb 15 , 2026 | 09:26 AM