Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు మరోసారి బాంబు బెదిరింపులు..
ABN , Publish Date - Dec 22 , 2025 | 08:30 AM
శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. దీంతో నెదర్లాండ్ వెళ్లే ఓ ఫ్లైట్‌ను అత్యవసరంగా ల్యాండ్ చేశారు విమానయాన అధికారులు.
హైదరాబాద్, డిసెంబర్ 22: నగరంలోని శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి(Bomb Threats at Shamshabad Airport). బాంబు బెదిరింపుల సమాచారం రావడంతో.. నెదర్లాండ్ వెళ్లే ఓ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయించారు అధికారులు.
నెదర్లాండ్(Netherland) విమానంలో బాంబు పెట్టినట్టు ఓ ఆగంతకుడి నుంచి ఎయిర్‌పోర్ట్ అధికారులకు మెయిల్ వచ్చింది(Bomb Threat Mail). దీంతో సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. సదరు ఫ్లైట్‌ను అత్యవసర ల్యాండింగ్ చేసి.. విమానం మొత్తం ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. అయితే.. ఈ ఏడాదిలో శంషాబాద్(Shamshabad) ఎయిర్‌పోర్ట్‌కు 20కి పైగా బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి.
ఇవీ చదవండి: