RSS Chief Mohan Bhagwat Clarifies: బీజేపీ కళ్లద్దాలతో సంఘ్‌ను చూడొద్దు
ABN , Publish Date - Dec 22 , 2025 | 04:43 AM
భారతీయ జనతా పార్టీ కళ్లద్దాలతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ను చూడడం అతిపెద్ద తప్పని ఆ సంస్థ సర్‌సం్‌ఘచాలక్ మోహన్ భాగవత్ చెప్పారు....
అది చాలా తప్పు ఆరెస్సెస్‌కు రాజకీయ అజెండా లేదు
హిందూ సమాజ రక్షణే సంఘ్ ధ్యేయం
ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టీకరణ
కోల్‌కతా, డిసెంబరు 21: భారతీయ జనతా పార్టీ కళ్లద్దాలతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ను చూడడం అతిపెద్ద తప్పని ఆ సంస్థ సర్‌సం్‌ఘచాలక్ మోహన్ భాగవత్ చెప్పారు. బీజేపీతో ఆరెస్సెస్‌ను పోల్చడం, రాజకీయ కోణంలో చూడడంతో అపార్థాలు తలెత్తుతున్నాయని అన్నారు. ఆరెస్సెస్‌కు ఎలాంటి రాజకీయ అజెండా లేదని, హిందూ సమాజాన్ని సంరక్షించడంతో పాటు అభివృద్ధికి పాటుపడడమే లక్ష్యమని భాగవత్ స్పష్టం చేశారు. హిందువులు జాగృతమయ్యారని, భారత్ త్వరలోనే విశ్వగురు స్థానానికి తిరిగి చేరుకుంటుందని, ఇదే సంఘ్ లక్ష్యమని చెప్పారు. ఆర్‌ఎ్‌సఎస్ వందేళ్ల వేడుకల సందర్భంగా కోల్‌కతాలో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. సంఘ్‌కు శత్రువుల్లేరని, అయితే ఆర్‌ఎ్‌సఎస్ విస్తరిస్తున్న కొద్దీ కొందరు స్వార్ధపరుల దుకాణాలు మూతపడుతున్నాయని ఆయన వ్యంగ్యంగా అన్నారు. సంఘ్‌పై అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, అయితే ఆ అభిప్రాయాలు వాస్తవాల ఆధారంగా ఏర్పరచుకుంటే బాగుంటుందని చెప్పారు. సంఘ్‌పై జరిగే దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ వాస్తవాలను ప్రజల ముందు ఉంచేందుకు కోల్‌కతాతో పాటు ముంబై, ఢిల్లీ, బెంగళూరులో కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. స్థానిక ఉత్పత్తులనే కొనాలని భాగవత్ పిలుపునిచ్చారు. ఇతర దేశాల భాషల కన్నా మాతృభాషలో మాట్లాడటానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.