Share News

Thieves Attack Passenger: శంషాబాద్‌లో దారుణం.. ప్రయాణికుడిపై దాడి చేసి నగదు కాజేసిన దొంగలు

ABN , Publish Date - Dec 28 , 2025 | 05:38 PM

శంషాబాద్‌లో దారుణం జరిగింది. ఓ ప్యాసింజర్‌పై దాడి చేసి రూ. 50 వేల నగదు, సెల్‌ఫోన్ ఎత్తుకెళ్లారు ఆటో డ్రైవర్, మరో నలుగురు వ్యక్తులు. ఈఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

Thieves Attack Passenger: శంషాబాద్‌లో దారుణం.. ప్రయాణికుడిపై దాడి చేసి నగదు కాజేసిన దొంగలు
Thieves Attack Passenger

రంగారెడ్డి జిల్లా, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): శంషాబాద్‌లో (Shamshabad) దారుణం జరిగింది. ఓ ప్యాసింజర్‌పై దాడి చేసి రూ. 50 వేల నగదు, సెల్‌ఫోన్ ఎత్తుకెళ్లారు ఆటో డ్రైవర్, మరో నలుగురు వ్యక్తులు. ఈఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. బంధువుల ఫంక్షన్ కోసం మహబూబ్‌నగర్ నుంచి శంషాబాద్‌కు వచ్చారు సత్యనారాయణ అనే వ్యక్తి. ఈ క్రమంలోనే శంషాబాద్ బస్టాండ్‌లో బస్సు కోసం ఎదురుచూస్తున్నారు సత్యనారాయణ.


అదే సమయంలో ఆటో రావడంతో ఆటో ఎక్కారు. కొంత దూరం వెళ్లాక ఆటో డ్రైవర్, మరో నలుగురు వ్యక్తులు సత్యనారాయణపై దాడి చేసి డబ్బులతో పరారీ అయ్యారు. బాధితుడు ఫిర్యాదుతో శంషాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితుడి నుంచి వివరాలు సేకరించారు. ఆటో నంబర్, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితుడిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

జీహెచ్‌ఎంసీ మరో కీలక నిర్ణయం.. అధికారుల బదిలీలు

నేను ఆంధ్రాలో చదివితే రేవంత్‌రెడ్డికి వచ్చిన నొప్పేంటీ.. కేటీఆర్ ప్రశ్నల వర్షం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 28 , 2025 | 05:42 PM