Share News

KTR: నేను ఆంధ్రాలో చదివితే రేవంత్‌రెడ్డికి వచ్చిన నొప్పేంటీ.. కేటీఆర్ ప్రశ్నల వర్షం

ABN , Publish Date - Dec 28 , 2025 | 04:21 PM

రేవంత్‌రెడ్డికి పాలమూరు మీద ప్రేమ లేదని... ఆయనకు భూములు, రియల్ ఎస్టేట్‌ల మీద మాత్రమే ప్రేమ ఉందని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రజల్లో ఆదరణ లేకపోవడంతోనే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఈ ఫలితాలు వచ్చాయని ఎద్దేవా చేశారు.

KTR: నేను ఆంధ్రాలో చదివితే రేవంత్‌రెడ్డికి వచ్చిన నొప్పేంటీ.. కేటీఆర్ ప్రశ్నల వర్షం
KTR

నాగర్ కర్నూల్ జిల్లా, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ సర్కార్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఆంధ్రాలో చదివితే రేవంత్‌రెడ్డికి వచ్చిన నొప్పేంటని ప్రశ్నించారు. మరి అప్పట్లో కాంగ్రెస్ పాలనలో మన తెలంగాణలో మంచి విద్య లేకుండా చేశారని విమర్శించారు. తమ ప్రభుత్వంలో రైతు రాజ్యం ఉందని... కాంగ్రెస్ సర్కార్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత రాబందుల రాజ్యం వచ్చిందని ఎద్దేవా చేశారు. యూరియా దుకాణాల ఎదుట చెప్పుల లైన్లు కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాటి రాజ్యం తెస్తామని చెబితే ఏమో అనుకున్నామని.. కానీ ఇలా చూస్తామని అనుకోలేదని విమర్శించారు కేటీఆర్.


అడ్డమైన హామీలు ఇచ్చి మీ పాలమూరు బిడ్డ అని రేవంత్‌రెడ్డి మోసం చేసి గెలిచారని ఆక్షేపించారు. ఎన్నో హామీలు ఇచ్చారని.. కానీ ఇప్పుడు ఆయన అసభ్యంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఇవాళ(ఆదివారం) నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అధ్యక్షతన సర్పంచుల సన్మాన సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా కేటీఆర్ హాజరయ్యారు. మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి, నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. పార్టీ శ్రేణుల ఉత్సాహం చూస్తుంటే తన కడుపు నిండి పోయిందని.. కేసీఆర్ మళ్లా సీఎం అయినట్లుగా ఉందని చెప్పుకొచ్చారు.

KTR-1.jpg


పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా కేసీఆర్ 70 టీఎంసీల రిజర్వాయర్‌లను ఐదు కట్టారని గుర్తుచేశారు. 90 శాతం పనులు పూర్తి చేసి.. ఒక పంపుకు కూడా బటన్ ఆన్ చేశారని ప్రస్తావించారు. సీఎం రేవంత్‌రెడ్డి మరి రెండేళ్లలో ఒక్క తట్టెడు మట్టి కూడా ఎందుకు తీయలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. తన పాత బాస్‌కు కోపం వస్తుందనే కారణంతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రేవంత్‌రెడ్డి పక్కన పెట్టారని ఆరోపణలు చేశారు. 1952లో బూర్గుల రామకృష్ణారావు 150 టీఎంసీలతో అప్పర్ కృష్ణా ప్రాజెక్టుకు ప్రణాళిక సిద్ధం చేశారని అన్నారు. కానీ 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత అప్పర్ కృష్ణా ప్రాజెక్టును కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. కేసీఆర్‌కు పేరు వస్తోందనే కారణంతో పాలమూరు ప్రాజెక్టును సీఎం రేవంత్‌రెడ్డి పట్టించుకోవడం లేదని ఆరోపించారు కేటీఆర్.

KTR-2.jpg


రేవంత్‌రెడ్డికి పాలమూరు మీద ప్రేమ లేదని... ఆయనకు భూములు, రియల్ ఎస్టేట్‌ల మీద మాత్రమే ప్రేమ ఉందని విమర్శించారు. . ప్రజల్లో ఆదరణ లేకపోవడంతోనే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఈ ఫలితాలు వచ్చాయని ఎద్దేవా చేశారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీలు 32 జిల్లా పరిషత్‌లు గెలిచామని గుర్తుచేశారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ఎన్ని సర్పంచ్ స్థానాలు గెలిచిందో తెలిసిందేనని అన్నారు. రెండేళ్లలోనే ప్రజలు మళ్లీ కేసీఆర్‌కు పట్టం కట్టాలని చూస్తున్నారని చెప్పుకొచ్చారు. ఆయన పాలనలో ప్రతీ పల్లె ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. పలు ప్రాజెక్టులు ఇప్పుడు మొత్తం కంప చెట్లు మొలిచి ఆగం ఆగం అయ్యాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

జీహెచ్‌ఎంసీ మరో కీలక నిర్ణయం.. అధికారుల బదిలీలు

దళితుల భూములను దౌర్జన్యంగా లాక్కున్నారు.. కవిత ఫైర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 28 , 2025 | 05:07 PM