Home » Telangana » Mahbubnagar
11వ ప్రపంచ వ్యవసాయ గణన జిల్లా వ్య వసాయశాఖ ఏఈవోలు, మండల గణాంక అధికారులు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా ప్రణాళిక అధికారి యోగానంద్, జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్, డిప్యూటీ గణాంక అధికారి నర్సింహులు అన్నారు.
మహిళపై కత్తితో దాడి చేసి, నగలు అపహరించేందుకు వ్యక్తి యత్నించిన సంఘటన నవాబ్‌పేట మండలంలో శనివారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితురాలి వివరాల ప్రకారం...
దేశ రక్షణ కోసం సరిహద్దులో బాధ్యత, త్యాగనిరతి, అంకితభావంతో మహత్తర భూమిక నిర్వహిస్తున్న సైనికుల సహాయార్థం సైనిక పతాక దినోత్సవ నిధి ఏర్పాటు చేసినట్లు మహబూబ్‌నగర్ కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు.
మహాత్మాగాంధీ చూపిన మార్గంలో నడుద్దామని జడ్చర్ల ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్‌రెడ్డి పిలుపు నిచ్చారు.
కేంద్రం ప్రభుత్వం అన్ని మునిసిపాలిటీలకు సమానంగా నిధులు మంజూరు చేస్తుందని ఎంపీ డీకే అరుణ అన్నారు. శనివారం నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఆరో వార్డులో టీయూఎఫ్ఐడీసీ(తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ర్ఫాస్ట్రక్షన్ డెవలప్మెంట్ కార్పొరేషన్), మునిసిపల్ నిధులతో ఏర్పాటు చేసిన పార్కును ఎంపీ అరుణ, ఎమ్మెల్యే పర్ణికారెడ్డి కలిసి ప్రారంభించారు.
చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎస్.మోహన్‌రావు కోరారు.
మూసివేసిన ఇరిగేషన్ పాటు కాలు వలను అధికారులు తీయిస్తున్నారు.
ఆడపిల్లలు అంటే అన్నం పెట్టేవాళ్లని, వాళ్లను నిర్లక్ష్యం చేయవద్దని, బాగా చదివించాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలను మహిళలు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు.
క్రీడలతో క్రీడాకారుల మధ్య స్నేహభావం పెంపొందుతోందని అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ అన్నారు.