Share News

గుంతలమయంగా బీటీ రోడ్డు

ABN , Publish Date - Feb 20 , 2026 | 11:24 PM

మండ లంలోని వేముల, చౌటకుంటతండా, రాయినోని కుంట తండా మధ్య ఉన్న బీటీ రోడ్డు గుంతల మయంగా మారడంతో ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

గుంతలమయంగా బీటీ రోడ్డు
గుంతలమయమైన బీటీ రోడ్డు

  • ఓవర్‌ లోడ్‌ టిప్పర్లతో రోడ్డు ధ్వంసం

  • మైనింగ్‌ మాఫియా, అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం

మిడ్జిల్‌, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి) : మండ లంలోని వేముల, చౌటకుంటతండా, రాయినోని కుంట తండా మధ్య ఉన్న బీటీ రోడ్డు గుంతల మయంగా మారడంతో ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్రమ మైనిం గ్‌ ద్వారా తరలిస్తున్న పలుగురాళ్ల టిప్పర్లు ని త్యం ఓవర్‌ లోడ్‌తో రోడ్డుపై వెళ్లడంతో రోడ్డు గో తులమయమై రాకపోకలు పూర్తిగా స్తంభించా యి. ద్విచక్ర వాహనదారులు కిందపడి గాయా లైన సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ రహదా రి మీదుగా రోజు విద్యా ర్థులు, రైతులు, ఉద్యోగు లు ప్రయాణిస్తుంటారు. వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్‌కు తరలిం చేందుకు ఇదే ప్రధాన మార్గం. అనుమతుల పే ర మైనింగ్‌ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ప్పటికీ సంబంధిత శాఖ అధికారులు తమకేమీ పట్టనట్లు ఉండటంతో విమర్శలకు తావిస్తోంది. ఈ విషయంపై పలుమార్లు సంబంధిత శాఖ అ ధికారులకు వినతిపత్రాలు అందజేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తండావాసులు ఆవే దన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే టిప్పర్లపై కే సులు నమోదు చేసి, అక్రమ మైనింగ్‌ను నిలిపి వేయాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. అ లాగే దెబ్బతిన్న రోడ్డును వెంటనే మరమ్మతు చే పట్టాలని కోరుతున్నారు. స్పందించకపోతే ఆందో ళనలు చేపడుతామని హెచ్చరిస్తున్నారు.

Updated Date - Feb 20 , 2026 | 11:24 PM