Share News

స్థలం చూపిస్తున్నాం.. పనులు ప్రారంభించండి

ABN , Publish Date - Feb 20 , 2026 | 11:23 PM

మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాల ని ర్మాణం కోసం స్థలం చూపిస్తున్నాం..

 స్థలం చూపిస్తున్నాం.. పనులు ప్రారంభించండి
స్థలం చూపిస్తున్న బీఆర్‌ఎస్‌ మండల నాయకులు

రాజాపూర్‌, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి) : మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాల ని ర్మాణం కోసం స్థలం చూపిస్తున్నాం.. వెంటనే ప నులు ప్రారంభించాలని మండల బీఆర్‌ఎస్‌ నా యకులు ఎమ్మెల్యేకు సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గురువారం ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ నా యకులు వారం రోజుల్లో స్థలం కేటాయించాలని సమయం ఇస్తున్నట్లు తెలిపారు. స్పందించిన బీఆర్‌ఎస్‌ నాయకులు మండల కేంద్రంలోని రె వెన్యూ కాలనీలో ప్రభుత్వ కార్యాలయాల నిర్మా ణానికి 2 వేల గజాల స్థలం ఉందని, ఆ స్థలం లో ఎమ్మెల్యే వారం రోజుల్లో పనులు ప్రారం భించాలని డిమాండ్‌ చేశారు. జడ్పీటీసీ మాజీ సభ్యుడు మోహన్‌నాయక్‌, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు శ్రీశైలంయాదవ్‌, మాజీ సర్పంచు బచ్చిరెడ్డి, నర్సింహులు, రమేష్‌నాయక్‌, నజీమ్‌ బైగ్‌, తిరుపతయ్య, శ్రీనివాస్‌, దేవేందర్‌, సత్య య్య, యాదగిరి, చెన్నయ్య పాల్గొన్నారు.

Updated Date - Feb 20 , 2026 | 11:23 PM