Share News

విద్యార్థులకు డిజిటల్‌ బోధన తప్పనిసరి

ABN , Publish Date - Feb 20 , 2026 | 11:41 PM

ప్రతీ పాఠశాలలో విద్యార్థులకు సాంకేతికతను అందిపుచ్చుకుని ఉపాధ్యాయులు డిజిటల్‌ బోధ న చేయాలని జోగుళాంబ గద్వాల జిల్లా విద్యాశాఖాధికారి విజయలక్ష్మి పేర్కొన్నారు.

విద్యార్థులకు డిజిటల్‌ బోధన తప్పనిసరి

- డీఈవో విజయలక్ష్మి

గద్వాల సర్కిల్‌, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): ప్రతీ పాఠశాలలో విద్యార్థులకు సాంకేతికతను అందిపుచ్చుకుని ఉపాధ్యాయులు డిజిటల్‌ బోధ న చేయాలని జోగుళాంబ గద్వాల జిల్లా విద్యాశాఖాధికారి విజయలక్ష్మి పేర్కొన్నారు. గద్వాల ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం జిల్లాలోని పీఎంశ్రీ పాఠశాలల్లో బోధన చేస్తున్న 180 మం ది ఉపాధ్యాయులు, హెడ్మాష్టర్లకు ఇన్‌ఫర్మేషన్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ టెక్నాలజీ (ఐసీటీ)పై ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డీఈవో మాట్లాడుతూ సాం కేతికతలో అత్యాధునిక విప్లవాత్మక మార్పులు వస్తున్న దృష్ట్యా అదేస్థాయిలో విద్యార్థులకు డి జిటల్‌ బోధన తప్పనిసరి అని తెలిపారు. అను భవజ్ఞులైన డిజిటల్‌ శిక్షక్షులు ఇచ్చే డిజిటల్‌ శి క్షణపై అవగాహన పెంచుకుని ఉపాధ్యాయులు టచ్‌ స్ర్కీన్‌ ఆధారిత బోర్డు ద్వారా (ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానల్‌ బోర్డు) విద్యార్థులు బోధన చే యాలని సూచించారు. ప్రతీ స్కూళ్లో కంప్యూటర్‌ ల్యాబ్‌లను విద్యార్థులకు అందుబాటులో ఉం డేలా చూడాలన్నారు. డిజిటల్‌ బోధనతో విద్యార్థులకు పాఠాలపై ఆసక్తి, ఏకాగ్రత పెరుగుతుందని తెలిపారు. జిల్లా విద్యాశాఖ సమన్వయ అధికారులు మైఖేల్‌, కర్రెప్ప, ఏపీవో శ్రీనివాసు లు, రీసోర్స్‌ పర్సన్స్‌ రామాంజనేయులు, శివశంకర్‌రెడ్డి, చక్రధర్‌, అక్షితుడు పాల్గొన్నారు.

Updated Date - Feb 20 , 2026 | 11:41 PM