అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
ABN , Publish Date - Feb 20 , 2026 | 11:22 PM
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి పేర్కొన్నారు.
ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి
జడ్చర్ల/మిడ్జిల్/నవాబ్‌పేట, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి) : అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి పేర్కొన్నారు. జడ్చర్ల మండలం మల్లెబోయిన్‌పల్లి, మిడ్జిల్ మండలం కొత్తూరు, నవాబ్‌పేట మండలం రాంసింగ్‌తండాలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లును శుక్రవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లబ్ధిదారురులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రతీ పేద కుటుంబానికి సొంత ఇల్లు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ఇటీవల మల్లాపూర్ గ్రామానికి చెందిన దాసరి కృష్ణయ్య మరణించగా, కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ జ్యోతిఅల్వాల్‌రెడ్డి, సర్పంచ్‌లు రాములు, శంకర్, శ్రీశైలం, ఉప సర్పంచ్ అర్జున్, నాయకులు వెంకటయ్య, గౌస్, సత్యంగుప్తా, సాయిలు, మల్లికార్జున్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, సైదులు, రవీందర్‌రెడ్డి, సుకుమార్‌రెడ్డి, అయ్యన్నగౌడ్, నవాబ్‌పేట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాంచంద్రయ్య, భూపాల్‌రెడ్డి, ఎంపీడీవో జయరాములు, బాలరాజు, శాంతయ్య
ఇందిరమ్మ ఇళ్లు పేదలకు వరం
మహబూబ్‌నగర్ రూరల్ : ప్రభుత్వం అందజేస్తున్న ఇందిరమ్మ ఇళ్లు పేదలకు వరంలాంటిదని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని కోడూర్‌లో హరిజన్ గోవిందమ్మ, లక్ష్మి ఇందిమ్మ ఇంటి గృహ ప్రవేశానికి హాజరై, మాట్లాడారు. మాజీ యూత్ అధ్యక్షుడు రవీందర్ ముదిరాజ్, వార్డు మెంబర్ పురుషోత్తం మార్కెట్ కమిటీ డైరెక్టర్ రామస్వామి, మన్యంకొండ డైరెక్టర్ ఆంజనేయులు, అఖిల భారత యాదవ సంఘం మండల అధ్యక్షుడు కృష్ణయాదవ్ పాల్గొన్నారు.
గండీడ్ : మండలంలోని లింగాయపల్లి, సల్కర్‌పేట్ గ్రామాల్లో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జితేందర్‌రెడ్డి, మండల సర్పంచ్‌ల సంఘం అఽఽధ్యక్షుడు భగవంత్‌రెడ్డి ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం నిర్వహించారు. సర్పంచులు పద్మమ్మ, లక్ష్మారెడ్డి, టీక్యానాయక్, రఘు పాల్గొన్నారు.