Share News

గిరిజనుల అభివృద్ధికి కాంగ్రెస్‌ కృషి

ABN , Publish Date - Feb 20 , 2026 | 11:21 PM

గిరిజన, బంజారాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర క్రీడా, మత్స్య శాఖమంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం మండలంలోని తిమ్మరెడ్డిపల్లి తం డాలో నిర్వహించిన సంత్‌ సేవాలాల్‌ 287 జయంతి వేడుకల్లో కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌, ఎస్పీ డాక్టర్‌ వినీత్‌ రాజ్‌తో కలిసి పాల్గొన్నారు.

గిరిజనుల అభివృద్ధికి కాంగ్రెస్‌ కృషి
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి వాకిటి శ్రీహరి

క్రీడా, మత్స్య శాఖమంత్రి వాకిటి శ్రీహరి

గిరిజనులతో కలిసి నృత్యం చేసిన మంత్రి, కలెక్టర్‌

ఊట్కూర్‌, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): గిరిజన, బంజారాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర క్రీడా, మత్స్య శాఖమంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం మండలంలోని తిమ్మరెడ్డిపల్లి తం డాలో నిర్వహించిన సంత్‌ సేవాలాల్‌ 287 జయంతి వేడుకల్లో కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌, ఎస్పీ డాక్టర్‌ వినీత్‌ రాజ్‌తో కలిసి పాల్గొన్నారు. తండా వా సులు లంబాడా సంప్రదాయ నృ త్యంతో స్వాగతం పలికారు. మంత్రి, అధికారులు మహిళలతో కలిసి నృత్యం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని తెలిపారు. సంత్‌ సేవాలాల్‌ చూపిన మార్గం అందరికీ ఆదర్శమన్నారు. బంజారాలకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమ అన్నారు. గిరిజనులు తమ పిల్లలను బాగా చదివించాలని అన్నారు. చదువు ఏ ఒక్కరి సొత్తూ కాదని, పిల్లలు బాగా చదివితేనే వారి బంగారు భవిష్యత్తుకు మార్గం ఏర్పడుతుందన్నారు. సేవాలాల్‌ చూపిన మార్గంలో నడవాలని అ న్నారు. అంతకు ముందు కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌, ఎస్పీ వినీత్‌ మాట్లాడారు. కార్యక్రమంలో ఆర్డీఓ రాంచందర్‌, తహసీల్దార్‌ చింత రవి, సీఐ రాంలాల్‌, సర్పంచ్‌ మెహన్‌నాయక్‌, కాంగ్రెస్‌ మండల అఽధ్యక్షుడు యజ్ఞేశ్వర్‌రెడ్డి, జడ్పీటీసీ మాజీ సభ్యుడు సూర్యప్రకా్‌షరెడ్డి, ఓబ్లపూర్‌ సర్పంచ్‌ సత్యనారాయణరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Feb 20 , 2026 | 11:21 PM