విద్యార్థుల సంఖ్య పెరుగుదలకు చర్యలు చేపట్టాలి
ABN , Publish Date - Feb 20 , 2026 | 11:40 PM
రాబోయే విద్యాసంవత్సరానికి వి ద్యార్థుల సంఖ్య పెరుగుదలకు అనుగుణంగా తగు రీతిన ప్రచారం కోసం చర్యలు చేపట్టాలని రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అన్నా రు.
- రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి
వంగూరు ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): రాబోయే విద్యాసంవత్సరానికి వి ద్యార్థుల సంఖ్య పెరుగుదలకు అనుగుణంగా తగు రీతిన ప్రచారం కోసం చర్యలు చేపట్టాలని రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అన్నా రు. తెలంగాణ పబ్లిక్ స్కూల్‌గా ఎంపికైన నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు, పోల్కంపల్లి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో జరుగుతున్న తరగతి గదులు, కాంపౌండ్‌వాల్ నిర్మాణ పనులను శుక్రవారం ఆయన పరిశీలించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాల నందు భో జనశాల ఏర్పాటుకు తగిన రీతిలో కార్యక్రమం రూపొందించుకోవాలని ఆదే శించారు. ప్రధానమైన నిర్మాణాలను సూచించే విధంగా ఒక బస్సు కొనుగో లుకు తక్షణమే ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. కమిటీ సభ్యుల పనితీ రు అదేవిధంగా కొనసాగించాలని ప్రోత్సహించారు. ఈ స్కూళ్లతో పేద వి ద్యార్థులకు మెరుగైన విద్య అందుతుందన్నారు. రాష్ట్ర విద్యా కమిషన్ సభ్యు రాలు పద్మ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రఘువీర్, ఏఈ కోటేశ్వర్‌రావు, బాలకిష్టారెడ్డి, ఎంఈవో మురళిమోహనాచారి, శశాంక్‌రెడ్డి, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.