Share News

విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు

ABN , Publish Date - Feb 20 , 2026 | 11:40 PM

విధుల్లో అలసత్వం వహించే అధికారులను ఊపేక్షించేది లేదని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ హెచ్చరించారు.

విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ బీఎం సంతోష్‌

  • భూ భారతి దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచొద్దు

  • జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌ బీఎం సంతోష్‌

గద్వాల న్యూటౌన్‌, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): విధుల్లో అలసత్వం వహించే అధికారులను ఊపేక్షించేది లేదని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ హెచ్చరించారు. భూ భారతి దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా నిర్ధేశిత గడువులోగా పరిష్కరించాలని ఆయన రెవెన్యూ శాఖ అధికారులను ఆదేశించారు.శుక్రవారం కలెక్టర్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాలులో జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. ఆర్డీవో స్థాయిలోనే 1370 భూభారతి దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, సంబంధిత మండలాల రెవెన్యూ అధికారులు కూడా తమ పరిఽదిలోని భూ భారతి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని చెప్పారు. కుల, ఆదాయ, తదితర ధ్రువీకరణ పత్రాలతో పాటు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ దరఖాస్తులను కూడా నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు. ల్యాండ్స్‌ సర్వే విషయంలోనూ నిర్లక్ష్యం వహించకుండా, లైసెన్స్‌ ్డ సర్వేయర్ల సహకారం కూడా తీసుకొని ముందుకెళ్లాలని సూచించారు. భూ నిర్వాసితుల పునరావాస కేంద్రాల్లో నెలకొన్న సమస్యలను కూడా సంబంధిత శాఖల అధికారుల సహకారంతో సమన్వయం చేసుకుంటూ పరిష్కరించాలన్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ వేగవంతం చేయాలని, ఎస్‌ఐ ఆర్‌ మ్యాపింగ్‌లో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా సంబంధిత సూపర్‌వైజర్లు, బీఎల్‌వోలకు రెవెన్యూ అధికారులు సహకరించాలని చెప్పారు. జిల్లాలోని సంక్షేమ వసతిగృహాలను తహసీల్దార్లు తరచూ సందర్శిస్తూ తనిఖీలు చేయాలన్నా రు. విధుల్లో అలసత్వం వహించే అధికారులను ఊపేక్షించేది లేదని, నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆర్డీవో శ్రీనివాసరావు, సర్వే ఏడీ నూకరాజు, ఆయా మండలాల తహసీల్దార్లు తదితరులు ఉన్నారు.

Updated Date - Feb 20 , 2026 | 11:40 PM