Home » Nagarkurnool
నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండల కేంద్రానికి చెందిన ఎండీ బురానుద్దీన్(49) కుటుంబ కలహాలతో తన సొంత ఇంటిలోనే మూడు రోజుల క్రితం దారుణ హత్యకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయించడం కేంద్ర ప్రభుత్వ దుశ్చర్య అని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మత రాజకీయాలకు తెర లేపారని ధ్వజమెత్తారు.
దొరలకు సమస్యలపై అవగాహన ఉండకపోవచ్చని.. పేదల మధ్య పెరిగిన తనకు సమస్యలు తెలియవా? అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తట్ట పనికి, మట్టి పనికి మనమే కావాలి.. కానీ, పరిపాలనకు పాలమూరు బిడ్డలు పనికిరారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
నాగర్ కర్నూల్ జిల్లాలో ఇటీవల కుమ్మెర మల్లన్న జాతరలో జరిగిన గొడవలో రెండు నెలల చిన్నారి మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బాధిత కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పరామర్శించారు.
నాగర్ కర్నూల్ జిల్లాలోని కుమ్మెర గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. భక్తిశ్రద్ధలతో జరగాల్సిన మల్లన్న జాతరలో.. నిర్వాహకుల దురుసు ప్రవర్తన ఓ పసిప్రాణాన్ని బలితీసుకుంది. దైవ దర్శనం కోసం వెళ్లిన భక్తులపై నిర్వాహకులు జరిపిన దాడిలో మూడు నెలల పసిపాప ప్రాణాలు కోల్పోవడంపై స్థానికులు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. వెల్దండ మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో పురుగుల అన్నం పెడుతున్నారని విద్యార్థినులు ఆరోపించారు.
స్వీట్ షాపులో సమోసా తిన్న కస్టమర్‌కు ఊహించని షాక్ తగిలింది. సమోసాలో పిన్నులు బయటపడ్డాయి. నాగర్ కర్నూలు జిల్లాలో గురువారం చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఊరుకొండ మండలం ముచ్చర్లకు చెందిన స్నేహ, సిరి, శ్రీమన్‌లు అనే ముగ్గురు విద్యార్థినిలు నీటి సంపు దగ్గరకు వెళ్లారు. ప్రమాదవశాత్తూ..
రేవంత్‌రెడ్డికి పాలమూరు మీద ప్రేమ లేదని... ఆయనకు భూములు, రియల్ ఎస్టేట్‌ల మీద మాత్రమే ప్రేమ ఉందని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రజల్లో ఆదరణ లేకపోవడంతోనే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఈ ఫలితాలు వచ్చాయని ఎద్దేవా చేశారు.