తీవ్ర విషాదం.. నీటి సంపులో పడి ముగ్గురు విద్యార్థినిలు మృతి
ABN , Publish Date - Jan 25 , 2026 | 05:04 PM
నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఊరుకొండ మండలం ముచ్చర్లకు చెందిన స్నేహ, సిరి, శ్రీమన్‌లు అనే ముగ్గురు విద్యార్థినిలు నీటి సంపు దగ్గరకు వెళ్లారు. ప్రమాదవశాత్తూ..
నాగర్ కర్నూల్, జనవరి 25: జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నీటి సంపులో పడి ముగ్గురు విద్యార్థినిలు ప్రాణాలు కోల్పోయారు. ఊరుకొండ మండలం ముచ్చర్లకు చెందిన స్నేహ, సిరి, శ్రీమన్‌లు నీటి సంపు దగ్గరకు వెళ్లి ప్రమాదవశాత్తూ అందులో పడిపోయారు. ఊపిరి ఆడక ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
మృతదేహాలను నీటిలోంచి వెలికి తీసిన తర్వాత పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్నారుల కుటుంబసభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చిన్నారుల తల్లిదండ్రుల పరిస్థితి చూసి.. గ్రామస్తులు సైతం కంటతడి పెట్టుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి
తమిళనాడులో హిందీకి ఎప్పటికీ చోటుండదు.. ఎంకే స్టాలిన్
వైరల్ పెంగ్విన్ వీడియో వెనుక కన్నీళ్లు పెట్టించే కథ