తమిళనాడులో హిందీకి ఎప్పటికీ చోటుండదు.. ఎంకే స్టాలిన్
ABN , Publish Date - Jan 25 , 2026 | 04:35 PM
హిందీ వ్యతిరేక ఆందోళన 1965లో తారాస్థాయికి చేరినప్పటి వీడియోను సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో స్టాలిన్ ఆదివారంనాడు పోస్ట్ చేశారు. 'భాషా అమరవీరుల దినోత్సవం: అప్పుడు, ఇప్పుడు హిందీకి ఇక్కడ చోటు లేదు' అని స్టాలిన్ రాసుకొచ్చారు.
చెన్నై: తిభాషా విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తమిళనాడు ప్రభుత్వం మరోసారి ఈ అంశాన్ని తెరపైకి తెచ్చింది. తమిళనాడులో అప్పుడు, ఇప్పుడు, ఎప్పటికీ హిందీకి చోటు లేదని ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ (MK Stalin) అన్నారు. గతంలో హిందీ వ్యతిరేక ఆందోళన సందర్భంగా ఆత్మబలిదానం చేసిన 'భాషా అమరవీరుల దినోత్సవం' సందర్భంగా ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
హిందీ వ్యతిరేక ఆందోళన 1965లో తారాస్థాయికి చేరినప్పటి వీడియోను సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో స్టాలిన్ ఆదివారంనాడు పోస్ట్ చేశారు. 'భాషా అమరవీరుల దినోత్సవం: అప్పుడు, ఇప్పుడు హిందీకి ఇక్కడ చోటు లేదు' అని స్టాలిన్ రాసుకొచ్చారు. తమిళ భాషను రాష్ట్ర ప్రజలు ప్రాణంగా ప్రేమిస్తారని, హిందీని బలవంతంగా రుద్దే ఎలాంటి చర్యలనైనా అదే తీవ్రతతో తాము వ్యతిరేకిస్తామని అన్నారు. తమిళ భాషా పరిరక్షణ కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరులకు ఆయన నివాళులర్పించారు.
తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికీ ద్విభాషా (తమిళం, ఇంగ్లీషు) విధానాన్ని అనుసరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం బలవంతంగా త్రిభాషా విధానాన్ని రుద్దుతోందంటూ ఆ చర్యను వ్యతిరేకిస్తోంది. జాతీయ విద్యావిధానాన్ని అమలు చేయకపోవడం వల్లే కేంద్ర తమిళనాడుకు నిధులు ఆపేస్తోందని స్టాలిన్ ఆరోపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
ఇది ఎన్నికల పోరు కాదు, ప్రజాస్వామ్య యుద్ధం.. విజయ్
గణతంత్ర దినోత్సవం..982 మంది పోలీసులకు అవార్డులు
Read Latest National News