Share News

Kavitha: దళితుల భూములను దౌర్జన్యంగా లాక్కున్నారు.. కవిత ఫైర్

ABN , Publish Date - Dec 27 , 2025 | 05:25 PM

మెడికల్ కాలేజీకి 40 ఎకరాల దళితుల భూములను దౌర్జన్యంగా లాక్కున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో కాంట్రాక్టర్లకు అడ్వాన్స్‌డ్ కల్చర్ సీఎం రేవంత్ రెడ్డి తెచ్చారని ఆక్షేపించారు.

Kavitha: దళితుల భూములను దౌర్జన్యంగా లాక్కున్నారు.. కవిత ఫైర్
Kavitha

నాగర్ కర్నూల్ జిల్లా,డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డిపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డిది డైవర్షన్, కరప్షన్ పాలన అని విమర్శలు చేశారు. ఇవాళ(శనివారం) నాగర్ కర్నూలు జిల్లాలో జనం బాటలో భాగంగా పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా వారి సమస్యలు తెలుసుకున్నారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టకి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తానని ధైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడారు కవిత.


మెడికల్ కాలేజీకి 40 ఎకరాల దళితుల భూములను దౌర్జన్యంగా లాక్కున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో కాంట్రాక్టర్లకు అడ్వాన్స్‌డ్ కల్చర్‌ని సీఎం రేవంత్‌రెడ్డి తీసుకువచ్చారని ఆక్షేపించారు. దుందిబీ నదిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు పోటాపోటీగా ఇసుక దోపిడీ చేస్తున్నారని ఆరోపణలు చేశారు. అభివృద్ధి అవకాశాలు అందరికీ సమానంగా రావాలని సూచించారు. సామాజిక తెలంగాణ సాధనకు తాను కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. కేసీఆర్ హయాంలో కాళేశ్వరాన్ని పరుగులు పెట్టించినట్లుగా పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టును ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. నల్ల మట్టి తీసేందుకు రైతుల వద్ద తీసుకున్న900 ఎకరాల భూమిని వారికి వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. పదేళ్లలో డిండి ప్రాజెక్ట్‌కి నీటిని తరలించలేదని.. ప్రభుత్వం మారిన కూడా ఇంకా సర్వేలే జరుగుతున్నాయని కవిత విమర్శించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

డ్రగ్స్‌ కేసులపై బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్

డ్రగ్స్ కేసు.. తప్పించుకున్న నటి సోదరుడు.. పోలీసుల గాలింపు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 27 , 2025 | 05:32 PM