Share News

Bandi Sanjay: డ్రగ్స్‌ కేసులపై బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్

ABN , Publish Date - Dec 27 , 2025 | 04:19 PM

డ్రగ్స్‌ కేసులపై కేంద్రమంత్రి బండి సంజయ్‌ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ కుటుంబసభ్యుల భవిష్యత్‌ నాశనమవుతుందనే భయంతోనే.. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఈ కేసు నీరుగార్చారని ఆరోపించారు.

Bandi Sanjay: డ్రగ్స్‌ కేసులపై బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్
Bandi Sanjay Kumar

హైదరాబాద్,డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): డ్రగ్స్‌ కేసులపై (Drug Cases) కేంద్రమంత్రి బండి సంజయ్‌ కుమార్ (Bandi Sanjay Kumar) సంచలన వ్యాఖ్యలు చేశారు. పండుగల అప్పుడే డ్రగ్స్‌ కేసులు నమోదు చేస్తారా? అని రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అకున్ సబర్వాల్ ఆధ్వర్యంలో నాటి డ్రగ్స్ కేసు విచారణ ఏమైంది..? అని నిలదీశారు. అనేకమంది సెలబ్రిటీల పేర్లు బయటకు వచ్చాయి కదా..? ఏం చేశారని ప్రశ్నించారు. తమతోపాటు కేసీఆర్‌ కుటుంబ సభ్యులు కూడా డ్రగ్స్ తీసుకున్నారని.. గతంలో నిందితులు వాంగ్మూలం ఇచ్చారు కదా అని గుర్తుచేశారు. ఇవాళ(శనివారం) హైదరాబాద్ వేదికగా మీడియాతో మాట్లాడారు బండి సంజయ్.


నిందితుల వాంగ్మూలం ఆడియో, వీడియో రికార్డు చేశారని తెలిపారు. తమ కుటుంబ సభ్యుల భవిష్యత్‌ నాశనమవుతుందనే భయంతోనే.. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఈ కేసు నీరుగార్చారని ఆరోపించారు. అకున్‌ సబర్వాల్‌ను డ్రగ్స్‌ కేసు నుంచి ఎందుకు తప్పించారని ప్రశ్నించారు. అకున్‌ సబర్వాల్‌ సేకరించిన ఆధారాలు, వీడియో స్టేట్‌మెంట్స్‌ను నాటి సీఎస్‌ సోమేశ్‌కుమార్ స్వాధీనం చేసుకున్నారని ప్రస్తావించారు. గతంలో సేకరించిన ఆధారాలు ఏమయ్యాయి..? అని నిలదీశారు. సోమేశ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించాలని అన్నారు బండి సంజయ్ కుమార్.


డ్రగ్స్ కేసులో ఈగల్‌ టీమ్‌ లీగల్‌గా విధులు నిర్వహిస్తోందా..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఈగల్‌ టీమ్‌లో కొంతమంది డ్రగ్ పెడ్లర్లతో రాజీపడుతున్నారని ఆరోపణలు చేశారు. అకున్‌ సబర్వాల్‌కి తిరిగి డ్రగ్స్‌ కేసు బాధ్యతలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు.


ఇవి కూడా చదవండి...

ఆన్‌లైన్‌ గేమ్స్‌కు మరొకరు బలి...

డ్రగ్స్ కేసు.. తప్పించుకున్న నటి సోదరుడు.. పోలీసుల గాలింపు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 27 , 2025 | 04:25 PM