Medchal: ఆన్‌లైన్ గేమ్స్‌కు మరొకరు బలి...
ABN , Publish Date - Dec 27 , 2025 | 10:40 AM
ఆన్‌లైన్ గేమ్స్‌కు మరో యువకుడు బలి అయ్యాడు. ఆన్‌లైన్‌లో పెట్టుబడి పెట్టి మోసపోయానంటూ రవీందర్ అనే యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు చేసుకున్నాడు.
మేడ్చల్, డిసెంబర్ 27: జిల్లాలోని సూరారం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆన్‌లైన్ గేమ్స్‌కు అలవాటుపడ్డ రవీందర్ (24) అనే యువకుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసైన రవీందర్ అందులో పెట్టుబడి పెట్టి మోసపోయాడు. దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన మరణానికి ఎవరూ బాధ్యులు కారంటూ వీడియో రికార్డ్ చేశాడు. ఆపై రవీంద్ తన గదిలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని రవీందర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా.. గత కొద్దిరోజులుగా రవీందర్ ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతూ ఆర్థికంగా నష్టపోయాడు. నష్టాలు పూరించేందుకు స్నేహితులు, తెలిసిన వారి వద్ద నుంచి భారీగా నగదును అప్పుగా తీసుకుని మరోసారి ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌లో పెట్టుబడులు పెట్టాడు. అయితే ఎంత పెట్టుబడి పెట్టినా అతడికి లాభాలు రాకపోగా, ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయాడు. ఈ క్రమంలోనే సూసైడ్‌కు పాల్పడినట్లు తెలుస్తోంది.
ఆత్మహత్యకు ముందు రవీందర్ ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేశాడు. ఆన్‌లైన్ గేమ్స్‌లో పెట్టుబడులు పెట్టి మోసపోయానని వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నానని, తనలా ఇంకెవరూ మోసపోవద్దంటూ స్నేహితులను కోరాడు. తన చావుకు ఎవరూ బాధ్యులు కాదంటూ వీడియో రికార్డ్ చేసిన అనంతరం గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రవీందర్ ఆర్థిక సమస్యలతో ఎక్కడెక్కడ అప్పులు చేశాడు, ఎంత మేరకు నష్టపోయాడు, సూసైడ్‌కు పూర్తి కారణాలు ఏంటి అనేదానిపై సూరారం పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
డ్రగ్స్ కేసు.. తప్పించుకున్న నటి సోదరుడు.. పోలీసుల గాలింపు
Read Latest Telangana News And Telugu News