Share News

Drugs Case: డ్రగ్స్ కేసు.. తప్పించుకున్న నటి సోదరుడు.. పోలీసుల గాలింపు

ABN , Publish Date - Dec 27 , 2025 | 10:01 AM

డ్రగ్స్ కేసులో టాలీవుడ్, బాలీవుడ్‌లో గుర్తింపు ఉన్న ప్రముఖ నటి సోదరుడి కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. గత సంవత్సరం కూడా డ్రగ్స్ కేసులో నటి సోదరుడు పట్టుబడిన విషయం తెలిసిందే.

Drugs Case: డ్రగ్స్ కేసు.. తప్పించుకున్న నటి సోదరుడు.. పోలీసుల గాలింపు
Drugs Case

హైదరాబాద్, డిసెంబర్ 27: మాసబ్‌ట్యాంక్ డ్రగ్స్‌ కేసుపై (Drugs Case) దర్యాప్తు కొనసాగుతోంది. ఈకేసులో నిందితుడు ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్‌ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ పరారీలో ఉన్నాడు. హీరోయిన్ సోదరుడి కోసం ఈగల్ టీం, మాసబ్ ట్యాంక్ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ట్రూప్ బజార్‌కు చెందిన నితిన్ సింఘానియా, శ్రనిక్ సింఘ్విల అరెస్టుతో నటి సోదరుడు పేరు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. పట్టుబడ్డ ఇద్దరు వ్యాపారులకు నలుగురు రెగ్యులర్ కస్టమర్లు సప్లై చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.


ఇద్దరు వ్యాపారవేత్తల నుంచి నటి సోదరుడు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు బయటపడింది. వ్యాపారవేత్తల నుంచి 43 గ్రాముల కొకైన్, ఎండీఎంఏ (MDMA) డ్రగ్స్‌‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే టాలీవుడ్, బాలీవుడ్‌లో మంచి గుర్తింపు ఉన్న ప్రముఖ నటి సోదరుడి కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.


కాగా.. న్యూఇయర్ వేడుకల సందర్భంగా ఈగల్ టీం హైదరాబాద్ వ్యాప్తంగా దృష్టి సారించింది. డ్రగ్స్ నివారణకు ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఇటీవల డిసెంబర్ 19న మాసబ్‌ ట్యాంక్ వద్ద ట్రూప్‌బజార్‌కు చెందిన ఇద్దరు వ్యాపారులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి హీరోయిన్ రకుల్ ప్రీత్‌ సింగ్ సోదరుడు తరచుగా డ్రగ్స్‌ కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అతని కోసం పోలీసులు వెతుకుతున్నారు. కాగా.. గత సంవత్సరం కూడా డ్రగ్స్ కేసులో సైబరాబాద్ పోలీసులకు నటి సోదరుడు పట్టుబడిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరోసారి డ్రగ్స్ వ్యవహారంలో ఇరుక్కోవడం సంచలనంగా మారింది.


ఇవి కూడా చదవండి...

నిజామాబాద్‌లో దొంగల బీభత్సం

రైల్వే చార్జీల పెంపు స్వల్పమే!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 27 , 2025 | 11:17 AM