Secundrabad: రైల్వే చార్జీల పెంపు స్వల్పమే!
ABN , Publish Date - Dec 27 , 2025 | 07:29 AM
రైల్వే చార్జీల పెంపు స్వల్పంగానే ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పెరిగిన చార్జీలు నిన్నటి నుంచి అమల్లోకి వచ్చాయి. కిలోమీటర్‌కు స్వల్పంగా (1 లేదా 2పైసల) పెంపు ఉన్నప్పటికీ, సబ్‌అర్బన్ ప్రయాణికులు, సీజన్ టికెట్ దారులపై భారం పడకుండా చర్యలు తీసుకోవడమే ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు.
- ప్రయాణికుల సంఘాలు
హైదరాబాద్ సిటీ: రైల్వేశాఖ కొత్తగా ప్రతిపాదించిన చార్జీల పెంపు ప్రభావం స్వల్పంగానే ఉందని ప్రయాణికుల సంఘాలు భావిస్తున్నాయి. శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చిన కొత్త చార్జీల ప్రకారం సికింద్రాబాద్ నుంచి చెన్నై, విశాఖపట్నం వైపు వెళ్లే పలు రైళ్లలో స్లీపర్, ఏసీ తరగతుల్లో రూ.10నుంచి గరిష్ఠంగా 15వరకు చార్జీలు పెరగడం పట్ల పేద, మధ్య తరగతి ప్రయాణికుల నుంచి పెద్దగా వ్యతిరేకత కనిపించడం లేదని ఆయా సంఘాల ప్రతినిధులు వెల్లడించారు. కిలోమీటర్‌కు స్వల్పంగా (1 లేదా 2పైసల) పెంపు ఉన్నప్పటికీ, సబ్‌అర్బన్ ప్రయాణికులు, సీజన్ టికెట్ దారులపై భారం పడకుండా చర్యలు తీసుకోవడమే ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు.

స్లీపర్, ఏసీ తరగతుల్లో..
కొత్త స్లాబుల ప్రకారం సెకండ్ క్లాస్ సీటింగ్ ప్రయాణికులకు 216కి.మీ నుంచి 750 కిమీ దూరానికి టికెట్‌పై రూ.5, 751-1,250 కిమీ దూరానికి రూ.10, 1,251-1,750 కిమీ దూరానికి రూ.15, 1,751-2,250 కిమీ దూరానికి రూ.20 చొప్పున చార్జీలు పెరిగాయి. సికింద్రాబాద్ నుంచి చెన్నై, సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వైపు వెళ్లే పలు రైళ్లలో దాదాపు అన్ని తరగతుల్లోనూ పెరిగిన చార్జీ రూ.10నుంచి 15లోపే ఉండడం గమనార్హం.
ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం ధరల్లో 5 రోజులుగా ర్యాలీ! ప్రస్తుత రేట్స్ ఇవీ..
3, 4, 5 తేదీల్లో మూడవ తెలుగు మహాసభలు
Read Latest Telangana News and National News