Gold Rates Dec 27: బంగారం ధరల్లో 5 రోజులుగా ర్యాలీ! ప్రస్తుత రేట్స్ ఇవీ..
ABN , Publish Date - Dec 27 , 2025 | 06:41 AM
గత ఐదు రోజులుగా దేశంలో బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. వచ్చే ఏడాది కూడా ధరల పెరుగుదల తప్పదనేది నిపుణుల అంచనా. మరి ఈ నేపథ్యంలో నేటి రేట్స్ ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో పసిడి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గత ఐదు రోజులుగా ధరల్లో ర్యాలీ కారణంగా బంగారం సగటు రేటు రూ.5800 మేర పెరిగింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, శనివారం ఉదయం 6.30 గంటల సమయంలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,030గా ఉంది. 22 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ.1,28,360కు చేరుకుంది. వెండి ధరల్లోనూ ర్యాలీ కొనసాగుతోంది. ప్రస్తుతం కిలో వెండి రూ.2,40,100గా ఉంది (Gold, Silver Rates on Dec 27).
వచ్చే ఏడాది కూడా ధరల పెరుగుదల కొనసాగుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ (31.10 గ్రాములు) 24 క్యారెట్ బంగారం ధర 4500 డాలర్ల మార్కును, ఔన్స్ వెండి 75 డాలర్ల మార్కును దాటాయి. ఈ ప్రభావం భారత్ మార్కెట్‌లోనూ కనిపిస్తోంది. ఈ ఏడాది బంగారం ధరలు 70 శాతం మేర, వెండి ధరలు 140 శాతం మేర పెరిగాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, లోహాల సరఫరాలో అంతరాయాలు, యూఎస్ ఫెడ్ మళ్లీ ప్రామాణిక వడ్డీ రేటును 25 బేస్ పాయింట్స్ మేర తగ్గిస్తుందన్న అంచనాల కారణంగా ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం (24కే, 22కే, 18కే) ధరలు
చెన్నై: ₹1,40,630; ₹1,28,910; ₹1,07,610
ముంబై: ₹1,40,030; ₹1,28,360; ₹1,05,030
న్యూఢిల్లీ: ₹1,40,180; ₹1,28,510; ₹1,05,180
కోల్‌కతా: ₹1,40,030; ₹1,28,360; ₹1,05,030
బెంగళూరు: ₹1,40,030; ₹1,28,360; ₹1,05,030
హైదరాబాద్: ₹1,40,030; ₹1,28,360; ₹1,05,030
విజయవాడ: ₹1,40,030; ₹1,28,360; ₹1,05,030
కేరళ: ₹1,40,030; ₹1,28,360; ₹1,05,030
పుణె: ₹1,40,030; ₹1,28,360; ₹1,05,030
వడోదరా: ₹1,40,080; ₹1,28,410; ₹1,05,080
అహ్మదాబాద్: ₹1,40,080; ₹1,28,410; ₹1,05,080
వెండి (కిలో) ధరలు ఇవీ
చెన్నై: ₹2,54,100
ముంబై: ₹2,40,100
న్యూఢిల్లీ: ₹2,40,100
కోల్‌కతా: ₹2,40,100
బెంగళూరు: ₹2,40,100
హైదరాబాద్: ₹2,54,100
విజయవాడ: ₹2,54,100
కేరళ: ₹2,54,100
పుణె: ₹2,40,100
వడోదరా: ₹2,40,100
అహ్మదాబాద్: ₹2,40,100
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు మార్కెట్లలో ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. కాబట్టి, బంగారం కొనుగోలు చేసే సమయంలో ధరలను మరోసారి పరిశీలించగలరు.
ఇవీ చదవండి:
సూపర్.. ప్రపంచంలో నెం.3 స్థానానికి చేరిన వెండి!
ఈ ఏడాది ఐటీ నియామకాల్లో 16 శాతం వృద్ధి