IT Hiring Grows: ఈ ఏడాది ఐటీ నియామకాల్లో 16 శాతం వృద్ధి
ABN , Publish Date - Dec 23 , 2025 | 03:32 AM
ఈ ఏడాది దేశీయ ఐటీ రంగం కాస్త కోలుకుందని ఓ నివేదిక పేర్కొంది. 2025లో ఐటీ ఉద్యోగ నియామాకాలు 18 లక్షలకు చేరాయని, గత సంవత్సరంతో పోలిస్తే ఇది 16 శాతం అధికమని సోమవారం విడుదలైన....
వర్క్‌ఫోర్స్, క్వెస్ కార్ప్ నివేదిక విడుదల
ముంబై: ఈ ఏడాది దేశీయ ఐటీ రంగం కాస్త కోలుకుందని ఓ నివేదిక పేర్కొంది. 2025లో ఐటీ ఉద్యోగ నియామాకాలు 18 లక్షలకు చేరాయని, గత సంవత్సరంతో పోలిస్తే ఇది 16 శాతం అధికమని సోమవారం విడుదలైన ‘ఐటీ వర్క్‌ఫోర్స్ ట్రెండ్స్ ఇన్ ఇండియా 2025’ నివేదిక వెల్లడించింది. టాలెంట్ సొల్యూషన్స్ ప్రొవైడర్ క్వెస్ కార్ప్, వర్క్ ఫోర్స్ సంయుక్తంగా దీన్ని రూపొందించాయి. మరిన్ని విషయాలు..
భారత ఐటీ రంగ నియామకాల్లో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల (జీసీసీ) వాటా గణనీయంగా పెరిగింది. 2024లో నమోదైన 15 శాతం నుంచి ఈ ఏడాదిలో 27 శాతానికి చేరుకుంది.
ప్రొడక్ట్, సాఫ్ట్‌వేర్ యాజ్ ఏ సర్వీ్‌స (ఎ్‌సఏఏఎస్) సంస్థల్లోనూ ఎంపిక చేసిన విధుల్లో హైరింగ్ పెరగగా.. ఐటీ సేవలు, కన్సల్టింగ్ విభాగంలో స్వల్ప వృద్ధి నమోదైంది. ఫండింగ్ తగ్గడంతో స్టార్ట్‌పల నియామకాల వృద్ధి ఏక అంకెకు జారుకుంది.
ఫ్రెషర్స్‌తో పోలిస్తే అనుభవజ్ఞులకే అధిక డిమాండ్ కన్పించింది. ఈ ఏడాది మొత్తం నియామకాల్లో 4-10 ఏళ్ల అనుభవం కలిగిన వారి వాటానే 65 శాతంగా ఉంది. 2024లో ఈ వాటా 50 శాతంగా నమోదైంది.
2025లో ఎంట్రీ లెవల్ ఉద్యోగుల హైరింగ్ వాటా 15 శాతంగా ఉండగా.. కాంట్రాక్టు ఉద్యోగుల వాటా 10-11 శాతంగా నమోదైంది.
కృత్రిమ మేధ (ఏఐ), క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ నైపుణ్యాలకు కంపెనీల నుంచి బలమైన డిమాండ్ కన్పించింది.
2026లోనూ ఐటీ ఉద్యోగ నియామకాల జోరు కొనసాగనుందని, ముఖ్యంగా డిజిటల్ నైపుణ్యాలకు డిమాండ్ అధికంగా ఉండనుందని నివేదిక పేర్కొంది. ఐటీ హైరింగ్ ద్వితీయ శ్రేణి నగరాల పరిధి దాటి విస్తరించనుంది. నియామకాల డిమాండ్ ఏఐ, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, డేటా స్పెషలిస్ట్ విభాగల మధ్య కేంద్రీకృతం కానుంది. బీఎ్‌ఫఎ్‌సఐ, ఎస్‌ఏఏఎస్, టెలికాం, మాన్యుఫాక్చరింగ్ రంగాల్లో ఐటీ నిపుణుల గిరాకీ పెరగనుంది.
వచ్చే ఏడాది హైరింగ్‌లో కంపెనీలు మానవ వనరుల విస్తరణ కంటే సామర్థ్యం ఆధారిత వృద్ధిపై దృష్టి సారించనున్నాయి.
29 శాతం పెరిగిన ఉద్యోగ అర్జీలు
ఈ సంవత్సరంలో జాబ్ అప్లికేషన్లు (ఉద్యోగ అర్జీలు) 9 కోట్లు దాటాయని, గత ఏడాదితో పోలిస్తే 29 శాతం పెరిగాయని జాబ్ పోర్టల్ అప్నా.కో సోమవారం విడుదల చేసిన ‘ఇండియా ఎట్ వర్క్ 2025’ నివేదిక వెల్లడించింది. మహిళలు, ఫ్రెషర్ల నుంచి అప్లికేషన్లు పెరగడం ఇందుకు ప్రధాన కారణమని పేర్కొంది. 2024తో పోలిస్తే ఈ ఏడాది మహిళల నుంచి ఉద్యోగ అర్జీలు 36 శాతం పెరిగాయని.. ముఖ్యంగా ఫైనాన్స్, అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్, కస్టమర్ ఎక్స్‌పీరియెన్స్, హెల్త్‌కేర్ సపోర్ట్ ఉద్యోగాలకు వీరి నుంచి అధిక అప్లికేషన్లు వచ్చినట్లు రిపోర్టు తెలిపింది. ఫ్రెషర్ల అప్లికేషన్లు కూడా వార్షిక ప్రాతిపదికన 10 శాతం పెరిగాయని వెల్లడించింది.