Home » Secundrabad
రైల్వే చార్జీల పెంపు స్వల్పంగానే ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పెరిగిన చార్జీలు నిన్నటి నుంచి అమల్లోకి వచ్చాయి. కిలోమీటర్‌కు స్వల్పంగా (1 లేదా 2పైసల) పెంపు ఉన్నప్పటికీ, సబ్‌అర్బన్ ప్రయాణికులు, సీజన్ టికెట్ దారులపై భారం పడకుండా చర్యలు తీసుకోవడమే ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు.
సంక్రాంతి పండుగను పురష్కరించుకుని ప్రయాణికుల రద్దీని దృష్ట్యా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. నాండేడ్-కాకినాడ మార్గంలో, అలాగే కాకినాడ నుంచి సికింద్రాబాద్ మీదుగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వేశాఖ తెలిపింది.
జనవరి ఒకటో తేదీ నుంచి పలు రైళ్ల వేళల్లో మార్పులు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌ఓ శ్రీధర్ తెలిపారు. లింగంపల్లి-విశాఖపట్నం మార్గంలో నడిచే జన్మభూమి ఎక్స్ప్రెస్కు అనపర్తి స్టేషన్‌లో హాల్ట్ కల్పిస్తున్నట్లు తెలిపారు.
క్రిస్మస్ పండుగను పురష్కరించుకుని రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. సికింద్రాబాద్-వేలాంకణి మధ్య మంగళవారం) రాత్రి 7.25గంటలకు ఓ రైలు. అలాగే.. బుధవారం సాయంత్రం 5.30గంటలకు మరో రైలు వేలాంకణికి బయలుదేరతాయని రైల్వేశాఖ తెలిపింది.
చర్లపల్లి రైల్వే టర్మినల్ నుంచి రోజూ 74 ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు నడుస్తున్నట్లు రైల్వైశాఖ తెలిపింది. 430 కోట్లతో చర్లపల్లి టర్మినల్ ఏర్పాటు చేశారు. చర్లపల్లి స్టేషన్ నుంచి నగరంలోని వివిధ ప్రాంతాలకు ఒక ఎంఎంఎటీఎస్ మాత్రమే నడుస్తుండగా, మరిన్ని సర్వీసులు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.
తిరుపతి, మచిలీపట్నం నుంచి నగరానికి రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్యరైల్వే అధికారులు తెలిపారు. ఈ రైళ్లు తిరుపతి నుంచి కాచిగూడకు, మచిలీపట్నం నుంచి ఉమ్డానగర్కు మధ్య నడుస్తాయని తెలిపారు.
సికింద్రాబాద్-అనకాపల్లి మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణమధ్యరైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ రైళ్లను నడుపుతున్నట్లు తెలిపారు. డిసెంబరు 4నుంచి వచ్చే ఏడాది మార్చి 26 వరకు ఈ ప్రత్యేక రైళ్లు నడుపుతాయని తెలిపారు.
సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు బుధవారం నుంచి 20 బోగీలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న సీట్ల సంఖ్యకు అదనంగా మరో 312 సీట్లు ప్రయాణికులకు అందుబాట్లోకి రానున్నాయి.
శబరిమల క్షేత్రంలో అయ్యప్పస్వామి భక్తుల సౌకర్యార్ధం కాట్పాడి -సేలం మీదుగా కొట్టాయం వరకు ఈ నెల 24న ప్రత్యేక రైలు నడపనున్నట్లు దక్షిణ రైల్వే ప్రకటించింది. శబరిమలై భక్తుల కోసం తెలంగాణ రాష్ట్రం చర్లపల్లి నుండి కేరళలోని కొట్టాయం వరకు ప్రత్యేక రైలు నడుపుతున్నారు.
సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకొని దూరప్రాంతాలకు ఎక్స్‌ప్రెస్ రైళ్లలో వెళ్లే నగర ప్రయాణికులకు దక్షిణ మధ్యరైల్వే ప్రత్యేక సదుపాయాన్ని కల్పించింది. సికింద్రాబాద్-లింగంపల్లి మార్గంలో నడిచే 16 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హైటెక్సిటీ స్టేషన్‌లో ప్రత్యేకంగా హాల్టింగ్ ఏర్పాటు చేసింది.