Secundrabad: అమ్మో.. వీధి కుక్కలు.. కాలనీల్లో గుంపులుగా సంచారం
ABN , Publish Date - Jan 13 , 2026 | 09:31 AM
నగరంలో వీధికుక్కల బెడద ఎక్కువైంది. ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా ఉంటూ స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ కుక్కల వల్ల ప్రధానంగా చిన్నపిల్లలు, మహిళలు రోడ్లపై నడవాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
- ప్రజలపై దాడి చేస్తున్నా పట్టించుకోని అధికారులు
హైదరాబాద్: జీడిమెట్ల, చింతల్ సర్కిళ్ల(Jeedimetla, Chintal circles) పరిధిలో వీధి కుక్కల బెడద తీవ్రంగా ఉంది. వీధుల్లో గుంపులుగా సంచరిస్తుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గతనెల 22న చింతల్ భగత్‌సింగ్‌నగర్(Bhagat Singh Nagar)లో ఆరేళ్ల బాలుడితోపాటు మరో ఇద్దరిపై దాడి చేశాయి. పదిరోజుల క్రితం సూరారంలో ఐదేళ్ల బాలుడు ఇంటి ఎదుట ఆడుకుంటుండగా దాడిచేసి కరిచాయి. వీధి కుక్కలు ప్రజలపై దాడి చేస్తున్నాయని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడం లేదని పలు కాలనీల వాసులు ఆరోపిస్తున్నారు. వీధి కుక్కల బెడదను నివారించాలని కోరుతున్నారు.

కుక్కలు ఎక్కువగా ఉంటున్న ప్రాంతాలు
- చింతల్ భగత్‌సింగ్‌నగర్‌లో బొడ్రాయి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పెంచల్‌రెడ్డి విగ్రహం సమీపంలో.
- చంద్రానగర్ నుంచి చింతల్ వెళ్లే హెచ్‌ఎంటీ రోడ్డులో.
- గణేష్ నగర్ డివిజన్ బాపునగర్, పద్మానగర్ ఫేజ్-2 నుంచి శ్రీరాంనగర్ వెళ్లే రెడ్డి కిరాణా స్టోర్ సమీపంలో పగలు, రాత్రి గుంపులుగా రోడ్లపై తిష్ఠవేసి వచ్చిపోయే వారి వెంట పడుతున్నాయి.
- తెలంగాణ తల్లి విగ్రహానికి కుడివైపు రోడ్డు, ఆర్‌ఎ్‌సకే స్కూల్ రోడ్డు నంబర్ 4 లింకు రోడ్డులో కుక్కలు గుంపుగా తిరుగుతున్నాయి.

ఈ వార్తలు కూడా చదవండి.
వందేభారత్ స్లీపర్‌లో నో ఆర్‌ఏసీ
‘తుంగభద్ర’ గేటు ట్రయల్‌రన్ సక్సెస్
Read Latest Telangana News and National News