Christmas special trains: సికింద్రాబాద్-వేలాంకణి మధ్య రెండు క్రిస్‌మస్ ప్రత్యేక రైళ్లు
ABN , Publish Date - Dec 23 , 2025 | 07:58 AM
క్రిస్‌మస్ పండుగను పురష్కరించుకుని రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. సికింద్రాబాద్-వేలాంకణి మధ్య మంగళవారం) రాత్రి 7.25గంటలకు ఓ రైలు. అలాగే.. బుధవారం సాయంత్రం 5.30గంటలకు మరో రైలు వేలాంకణికి బయలుదేరతాయని రైల్వేశాఖ తెలిపింది.
హైదరాబాద్ సిటీ: వేలాంకణి చర్చిలో క్రిస్‌మస్ ఉత్సవాలకు హాజరయ్యే వారికోసం సికింద్రాబాద్- వేలాంకణి (Secunderabad - Velankanni)మార్గంలో రెండు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) ప్రకటించింది. 07407 ప్రత్యేకరైలు ఈ నెల 23న (మంగళవారం) రాత్రి 7.25గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి బుధవారం సాయంత్రం 5.30గంటలకు వేలాంకణి చేరనుంది.

అలాగే, తిరుగు ప్రయాణంలో 07408 ప్రత్యేకరైలు ఈ నెల 25న (గురువారం) ఉదయం 8గంటలకు వేలాంకణిలో బయల్దేరి, శుక్రవారం ఉదయం 6.10గంటలకు సికింద్రాబాద్(Secunderabad)కు చేరుకుంటుందని అధికారులు తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి..
ఇచ్చంపల్లి నుంచి తరలిస్తే మహారాష్ట్రకు ముంపు!
Read Latest Telangana News and National News