Share News

Sankranthi special trains: సంక్రాంతికి మరిన్ని ప్రత్యేక రైళ్లు.. కాకినాడ నుంచి సికింద్రాబాద్‌ మీదుగా..

ABN , Publish Date - Dec 26 , 2025 | 07:27 AM

సంక్రాంతి పండుగను పురష్కరించుకుని ప్రయాణికుల రద్దీని దృష్ట్యా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. నాండేడ్‌-కాకినాడ మార్గంలో, అలాగే కాకినాడ నుంచి సికింద్రాబాద్‌ మీదుగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వేశాఖ తెలిపింది.

Sankranthi special trains: సంక్రాంతికి మరిన్ని ప్రత్యేక రైళ్లు.. కాకినాడ నుంచి సికింద్రాబాద్‌ మీదుగా..

హైదరాబాద్‌ సిటీ: సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకొని మరిన్ని ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) ప్రకటించింది.

నాండేడ్‌-కాకినాడ మార్గంలో...

ప్రత్యేకరైలు (07452) నాందేడ్‌ నుంచి జనవరి 12న మధ్యాహ్నం 1.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు కాకినాడ(Kakinada)కు చేరుకుంటుంది. కాకినాడ (07453) నుంచి జనవరి 13న మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు నాందేడ్‌కు చేరుకుంటుంది. అలాగే, మచిలీపట్నం నుంచి ప్రత్యేకరైలు (07454) జనవరి 11, 18వ తేదీల్లో ఉదయం 10 గంటలకు బయల్దేరి.. మరుసటి రోజు రాత్రి ఎనిమిది గంటలకు వికారాబాద్‌ చేరుకుంటుంది. ప్రత్యేక రైలు(07455) వికారాబాద్‌ నుంచి జనవరి 11, 18 తేదీల్లో రాత్రి పది గంటలకు బయల్దేరి.. మరుసటి రోజు ఉదయం 8.15కి మచిలీపట్నం చేరుకుంటుంది.


city2.2.jpg

అలాగే... కాకినాడ నుంచి సికింద్రాబాద్‌ మీదుగా వికారాబాద్‌, నాందేడ్‌ మార్గాల్లో, వికారాబాద్‌ నుంచి సికింద్రాబాద్‌ మీదుగా మచిలీపట్నం మార్గంలో మొత్తం ఆరు రైళ్లను నడపాలని నిర్ణయించారు. ప్రత్యేకరైలు (07450) కాకినాడ నుంచి జనవరి 19న సాయంత్రం 4.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు వికారాబాద్‌కు చేరుకుంటుంది. అలాగే, ప్రత్యేకరైలు(07451) వికారాబాద్‌ నుంచి జనవరి 20న ఉదయం 9 గంటలకు బయలుదేరి రాత్రి 9.15 గంటలకు కాకినాడకు చేరుకుంటుంది.


city2.3.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

మహానగరంలో మత్తు మూకలు!

ప్రతి దరఖాస్తుకూ జవాబుదారీ

Read Latest Telangana News and National News

Updated Date - Dec 26 , 2025 | 07:27 AM