Home » Vikarabad
కూతురి పెళ్లి రోజే ఓ తండ్రి ప్రాణాలు కోల్పోయాడు. పెళ్లి కోసం సరుకులు తేవడానికి వెళ్లి రోడ్డు ప్రమాదానికి గురై చనిపోయాడు. కూతురి పెళ్లి కోసం వేసిన పందిరి కిందే తండ్రి మృతదేహాన్ని ఉంచటం అందర్నీ కలిచి వేస్తోంది.
ఓ యువకుడిపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం తీవ్ర కలకలం రేపుతోంది. దీంతో అస్వస్థతకు గురైన యువకుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో వికారాబాద్-హైదరాబాద్ ప్రధాన రహదారిపై సోమవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది అక్కడికక్కడే మృతి చెందారు...
బస్సు ప్రమాదంలో గాయపడిన వారందరినీ వెంటనే హైదరాబాద్కు తరలించి మెరుగైన వైద్య చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి డీజీపీలను ఆదేశించారు. అందుబాటులో ఉన్న మంత్రులు వెంటనే ప్రమాద సంఘటనకు చేరుకోవాలని పేర్కొన్నారు.
భార్య అలివేలు, వదిన హనుమమ్మ, కూతురు శ్రావణిలను యాదయ్య కొడవలితో గొంతుకోసి హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొన్నారు. మరో కూతురు అపర్ణ యాదయ్య నుంచి తప్పించుకున్నట్లు తెలిపారు.
రేపల్లె-వికారాబాద్ మార్గంలో నడిచే డెల్టా ఎక్స్‌ప్రెస్ (17626) వేళలు నవంబరు 4నుంచి మారనున్నాయి. ప్రస్తుతం రేపల్లె నుంచి ప్రతిరోజూ రాత్రి 10.40గంటలకు బయల్దేరి సికింద్రాబాద్‌కు తర్వాతి రోజు ఉదయం 7.20గంటలకు చేరుకుంటోంది.
తను రాసిచ్చిన భూమిని అనుభవిస్తున్నారు కానీ, వృద్ధులైన తల్లిదండ్రులను మాత్రం కొడుకులు పట్టించుకోవడం లేదని ఓ వృద్ధ తండ్రి కలెక్టర్‌ను ఆశ్రయించాడు.
ప్రేమించి, పెద్దలను ఎదిరించి పెళ్లాడిన పక్కింటి కుర్రాడే ఆ యువతి పాలిట కాలయముడయ్యాడు. ఐదు నెలల గర్భిణి అని కూడా చూడకుండా.. కట్టుకున్న భర్తే ఆమెను హతమార్చాడు.
వికారాబాద్ జిల్లా పరిగి, పూడూరు మండలాల్లో గురువారం తెల్లవారుజామున భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. పరిగి మండలం బసిరెడ్డిపల్లి, రంగాపూర్, న్యామత్నగర్, పరిగి, చెన్గోముల్ తదితర ప్రాంతాల్లో తెల్లవారుజామున 3.56 గంటలకు భూమి స్వల్పంగా కంపించింది.
Earthquake In Vikarabad: వికారాబాద్ జిల్లాలో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. పరిగి పరిసర ప్రాంతాల్లో 3 సెకన్ల పాటు భూమి కంపించింది. రంగాపూర్, బసిపల్లి, న్యామత్నగర్లో భూ ప్రకంపనలు సంభవించాయి.