Sankranthi Special Trains: వివిధ మార్గాల్లో ‘సంక్రాంతి’ స్పెషల్ రైళ్లు
ABN , Publish Date - Jan 08 , 2026 | 06:42 AM
సంక్రాంతి పండుగను పురష్కరించుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆయా పట్టణాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్-విజయవాడ, అనకాపల్లి-చర్లపల్లి, హైదరాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ రైళ్లను నడుపుతున్నట్లు రైల్వేశాఖ తెలిపింది.
హైదరాబాద్ సిటీ: సంక్రాంతి రద్దీ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ(Andhra Pradesh, Telangana) రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు 12 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) ప్రకటించింది. 9, 10 తేదీల్లో హైదరాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ మార్గంలో రెండు, హైదరాబాద్-విజయవాడ(Hyderabad-Vijayawada) మార్గంలో రెండు, 9, 18 తేదీల్లో సిర్పూర్ కాగజ్‌నగర్- హైదరాబాద్ మార్గంలో రెండు, విజయవాడ-హైదరాబాద్(Vijayawada-Hyderabad) మార్గంలో రెండు ప్రత్యేకరైళ్లు నడవనున్నాయి. 14న చర్లపల్లి-అనకాపల్లి మార్గంలో ఒకటి, 15న అనకాపల్లి-చర్లపల్లి(Anakapalli-Charlapalli) మార్గంలో ఒకటి నడపనున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..
జనార్దనరావుతో చాలా ఏళ్లుగా స్నేహం
ప్రత్యేక సర్వీసుల్లో అదనపు చార్జీలు ఉండవు: ఆర్టీసీ
Read Latest Telangana News and National News
