Vande Bharat Train: ‘వందేభారత్’కు ఆరెంజ్ రంగు..
ABN , Publish Date - Jan 15 , 2026 | 01:17 PM
తిరుపతి-సికింద్రాబాద్‌ల మధ్య నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇకపై ఆరెంజ్ కలర్‌లో రాకపోకలు కొనసాగించనుంది. అలాగే.. 16 బోగీలుండగా మరో నాలుగు బోగీలను చేర్చి మొత్తం 20 బోగీలు ఏర్పాటు చేశారు.
- 20 బోగీలకు పెంపు
తిరుపతి: తిరుపతి-సికింద్రాబాదు వందేభారత్ రైలు(Vande Bharat train) ఇప్పుడు ఆరెంజ్ కలర్‌లో రాకపోకలు సాగిస్తోంది. ఈ రైలును 2023 ఏప్రిల్ 9న ప్రారంభించారు. కొన్ని నెలలపాటు 8 బోగీలతో నడిచింది. ప్రయాణికుల ఆదరణ ఉండటంతో 16 బోగీలకు పెంచారు. మళ్లీ డిమాండ్ పెరగడంతో 20 బోగీలకు పెంచేశారు. కొత్తగా ఆరెంజ్ రంగులో 20 బోగీల రైలుగా మారింది. ఇందులో 1,440సీట్ల సామర్థ్యం ఉంది. తిరుపతి(Tirupati) మీదుగా రాకపోకలు సాగించే అతిపెద్ద రైళ్లలో ఇదొకటి. కాగా, 102 వందేభారత్ రైళ్లలో ఈ రైలు మాత్రమే ప్రత్యేకంగా ఆరెంజ్ రంగులో నడుస్తుండడం విశేషం. గతంలో తెలుపు రంగులో ఉంది.

ఈ వార్తలు కూడా చదవండి.
మరింత పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
20 నుంచి వన్యప్రాణుల లెక్కింపు షురూ..
Read Latest Telangana News and National News
