Home » Vande Bharat Express
సత్యసాయి ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్‌లో.. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇకపై ఆగుతుంది. జనవరి 2వ తేదీ నుంచి రెండు నిమిషాలపాటు ఈ స్టేషన్‌లో నిలుపుతారు. ఈ మేరకు రైల్వేశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ రైలుకు ఇక్కడ స్టాపింగ్ కల్పాంచడం పట్ల ఈ ఏరాయా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు బుధవారం నుంచి 20 బోగీలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న సీట్ల సంఖ్యకు అదనంగా మరో 312 సీట్లు ప్రయాణికులకు అందుబాట్లోకి రానున్నాయి.
వందే భారత్ రైలు పది రోజుల్లోపు హిందూపురంలో ఆగుతుందని ఎంపీ బీకే పార్థసారథి తెలిపారు. హిందూపురానికి వచ్చిన ఆయన విలేకరలుతో మాట్లాడారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, తాను రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్నతో మాట్లాడామని తెలిపారు.
దేశవ్యాప్తంగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నెట్‌వర్క్ విస్తరణను వేగవంతం చేసే విధంగా ఇండియన్ రైల్వే శాఖ అడుగులు వేస్తుంది. ఈ క్రమంలో తాజాగా నాలుగు కొత్త వందే భారత్ రైళ్ల నిర్వహణకు ఆమోదం తెలిపింది.
నగరం నుంచి హిందూపూర్ వెళ్లే ప్రయాణికులకు శుభావార్త చెప్పారు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి వి.సోమన్న. కాచిగూడ రైల్వేస్టేషన్ నుంచి యశ్వంత్‌పూర్‌కు వెళ్లే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు (20703) హిందూపూర్‌లో ఆగుతుందని(హాల్టింగ్) ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో సరికొత్త భారత్‌ను ప్రపంచం మొదటిసారి చూసిందని ప్రధాని మోదీ తెలిపారు. భారత భద్రతా బలగాలు పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలను కొన్ని గంటల్లోనే మట్టికరిపించాయని పేర్కొన్నారు.
తిరుపతి నుంచి హైదరాబాద్ వెళుతున్న వందే భారత్ ట్రైన్ ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందాడు. గూడూరు - నెల్లూరు మధ్య ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ట్రైన్ ముందు భాగంలో మృతదేహం ఇరుక్కుపోయింది.
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో ఆక్యుపెన్సీ రేషియో 100కు పైగానే ఉందని కేంద్ర మంత్రి పార్లమెంటులో వెల్లడించారు. ఈ ఏడాది జూన్ వరకూ ఆక్యుపెన్సీ రేషియో 105.03 శాతంగా ఉందని తెలిపారు.
సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య నడుస్తున్న వందేభారత్ రైళ్లకు అదనపు స్టాపేజీల సదుపాయాన్ని మరో ఆరునెలల పాటు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య నడిచే 20707/20708 వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ఫిబ్రవరిలో ప్రారంభించిన అదనపు స్టాపేజీ (ఏలూరు) సదుపాయం ఆగస్టులో ముగియనుందని సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు.
వందే భారత్ రైలు బయల్దేరే 15 నిమిషాలు ముందు రిజర్వేషన్ చేసుకునేలా కొత్త సదుపాయం కల్పించారు. ఈ విషయమై దక్షిణ రైల్వే విడుదల చేసిన ప్రకటనలో... దక్షిణ రైల్వే పరిధిలోని పలు మార్గాల్లో వందే భారత్ రైళ్లు నడుపుతున్నామన్నారు. ఈ రైళ్లలో ప్రయాణించేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారన్నారు.