Share News

MP BK Parthasarathy: ‘పురం’లో వందే భారత్‌ ఆగుతుంది..

ABN , Publish Date - Nov 04 , 2025 | 12:45 PM

వందే భారత్‌ రైలు పది రోజుల్లోపు హిందూపురంలో ఆగుతుందని ఎంపీ బీకే పార్థసారథి తెలిపారు. హిందూపురానికి వచ్చిన ఆయన విలేకరలుతో మాట్లాడారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, తాను రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్నతో మాట్లాడామని తెలిపారు.

MP BK Parthasarathy: ‘పురం’లో వందే భారత్‌ ఆగుతుంది..

  • ఎంపీ బీకే పార్థసారథి

హిందూపురం(అనంతపురం): వందే భారత్‌ రైలు(Vande Bharat train) పది రోజుల్లోపు హిందూపురంలో ఆగుతుందని ఎంపీ బీకే పార్థసారథి(MP BK Parthasarathy) తెలిపారు. హిందూపురానికి వచ్చిన ఆయన విలేకరలుతో మాట్లాడారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(MLA Nandamuri Balakrishna), తాను రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్నతో మాట్లాడామని తెలిపారు. పురంలో వందే భారత్‌ రైలును ఆపేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారని అన్నారు.


pandu2.3.jpg

రైల్వే స్టేషన్‌లో ఆధునికీకరణ పనులు చేపడుతున్నామని అన్నారు. బళ్లారి నుంచి మడకశిర మీదుగా రైల్వే ట్రాక్‌ పనులు వేగంగా సాగుతాయని అన్నారు. చాకర్లపల్లి రైల్వే గేటువద్ద ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి పనులు త్వరలో ప్రారంభం అవుతాయని, దీనికి రూ.29 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. ఏడాదిలోపే పనులు పూర్తవుతాయని అన్నారు.


pandu2.jpg

ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించారని, రూ.92 కోట్లతో పట్టణంలో రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం అవుతాయని అన్నారు. సమావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొల్లకుంట అంజినప్ప, పార్టీ కన్వీనర్‌ శ్రీనివాసరావు, మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ అశ్వర్థనారాయణరెడ్డి, కార్పొరేషన్‌ డైరెక్టర్లు ఆనంద్‌, చంద్రమోహన్‌, పట్టణాధ్యక్షులు వెంకటేశ్‌, మంగేష్‌ తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఓటర్ల సమస్యకు సత్వర పరిష్కారం

అన్ని జిల్లాల్లో 400 కేవీ సబ్‌స్టేషన్లు

Read Latest Telangana News and National News

Updated Date - Nov 04 , 2025 | 12:45 PM