Home » Hindupur
అనంతపురం జిల్లాలోని హిందూపురం వాసులకు గుడ్న్యూస్.. ఈనెల 27నుంచి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఆగనుంది. యశ్వంత్‌పూర్ నుంచి కాచిగూడకు వెళ్లే వందేభారత్ రైలు.. 27వతేదీ నుంచి హాల్టింగ్ సౌకర్యం కల్పించారు. దీంతో ఈ ఏరియా వాసుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొత్త వివాదానికి దారితీశాయి. కొంతమంది వైసీపీ కార్యకర్తలు రప్పా.. రప్పా అంటూ జగన్ ఫోటోలను పట్టుకొని వీధుల్లో తిరగడం ఇప్పుడు వివాదాలు చోటుచేసుకున్నాయి. దీనిపై పొలీసులు సైతం కేసులు నమోదు చేస్తున్నారు.
ఎండుమిర్చి రైతులకు గిట్టుబాటు ధర అందేలా చూడాలని యార్డ్ అధికారులకు వ్యవసాయ మార్కెట్‌యార్డ్ చైర్మన అశ్వత్థనారాయణరెడ్డి ఆదేశించారు. శుక్రవారం స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డ్‌లో ఎండుమిర్చీ క్రయ విక్రయాలను పరిశీలించారు.
కార్మిక సమస్యలపై 31 నుంచి జనవరి 4 వరకు విశాఖపట్నంలో జరుగుతున్న సీఐటీయూ ఆల్‌ఇండియా మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం నాయకులు పిలుపునిచ్చారు.
పట్టణంలోని అన్నివీధులు ఇక సీసీరోడ్లుగా మార్చుతామని మున్సిపల్ చైర్మన రమేష్ అన్నారు. సోమవారం పట్టణంలోని మూడో వార్డులో రూ.92.5కోట్ల నిధులతో సీసీ రోడ్డు పనులకు భూమిపూజ చేశారు.
పట్టణాన్ని అభివృద్ధి చేయడమే ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ లక్ష్యమని మున్సిపల్ చైర్మన రమేష్, టీడీపీ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు, ఎమ్మెల్యే పీఏ వీరయ్య అన్నారు.
రాజీమార్గం ఎంతో ఉత్తమమని హిందూపురం అదనపు జిల్లా న్యాయాధికారి కంపల్లె శైలజ అ న్నారు. శనివారం జాతీయ మెగా లోక్ అదాలత నిర్వహించారు. 245 కేసులు నాలుగు బెంచీల ద్వారా పరిష్కరించారు.
మడకశిర నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్నారు. మండలంలో శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొని శంకుస్థాపను చేశారు.
పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని భూములు తీసుకున్నారు. ఏడాది దాటినా నష్టపరిహారం చెల్లించలేదంటూ చిలమత్తూరు మండలం టేకులోడు గ్రామ రైతులు అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం చిలమత్తూరులో ప్రజాదర్బార్ నిర్వహించారు.
జిల్లా కేంద్రం అనంతపురంలో ఇద్దరు ఎమ్మెల్యేలు ర్యాలీ నిర్వహించారు. అఖండ-2 సినిమా విడుదలకు అన్ని అడ్డంకులు తొలగిపోయిన సందర్భాన్ని పురష్కరించుకుని ర్యాలీ నిర్వహించారు. అటు బాలయ్య అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.