SBI: బాధిత కుటుంబాలకు ఎస్‌బీఐ అండ
ABN , Publish Date - Jan 02 , 2026 | 11:40 PM
స్టేట్‌బ్యాంక్‌లో శాలరీ అకౌంట్ ఉన్న ఉద్యోగ కుటుంబాలకు ఎస్బీఐ ఆర్థిక అండగా నిలుస్తుందని ఎస్బీఐ ధర్మవరం రీజనల్ మేనేజర్ శశిధర్‌కుమార్ అన్నారు. గత యేడాది ఏప్రిల్‌లో విద్యుతషాక్‌కు గురై సోమందేపల్లిలో లైనమన రామచంద్రారెడ్డి మృతిచెందాడు.
హిందూపురం, జనవరి 2(ఆంధ్రజ్యోతి): స్టేట్‌బ్యాంక్‌లో శాలరీ అకౌంట్ ఉన్న ఉద్యోగ కుటుంబాలకు ఎస్బీఐ ఆర్థిక అండగా నిలుస్తుందని ఎస్బీఐ ధర్మవరం రీజనల్ మేనేజర్ శశిధర్‌కుమార్ అన్నారు. గత యేడాది ఏప్రిల్‌లో విద్యుతషాక్‌కు గురై సోమందేపల్లిలో లైనమన రామచంద్రారెడ్డి మృతిచెందాడు. ఆయన భార్య నారాయణమ్మకు రూ.కోటి చెక్కును శుక్రవారం అందజేశారు. ఎస్బీఐ మెయిన బ్రాంచలో ఆర్‌ఎం విలేకరులతో మాట్లాడుతూ బ్యాంక్‌లో శాలరీ ఖాతాలున్న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమాదవశాత్తు మృతిచెందితే వారి కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలుస్తుందన్నారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఎస్బీఐ ఖాతా తెరవాలన్నారు. దేశంలో 53కోట్ల మంది ఖాతా కలిగి ఉన్న అతిపెద్ద బ్రాంచ అన్నారు. ఎస్బీఐలో ఖాతా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు కార్పొరేట్ శాలరీ ప్యాకెజ్ కింద ప్రమాద బీమా అందించామన్నారు. స్థానిక ఎస్బీఐ చీఫ్ మేనేజర్ శ్యామ్‌ప్రసాద్, నరేష్, ట్రాన్సకో డీ ఈ నాగన్న, ఏఈ మహేష్, జబీవుల్లా, లక్ష్మీకాంతరెడ్డి పాల్గొన్నారు.