Share News

Brahmarathotsavam ఘనంగా బ్రహ్మరథోత్సవం

ABN , Publish Date - Feb 17 , 2026 | 12:36 AM

మండలంలోని చౌళూరులో చంద్రమౌళేశ్వరి స్వామి బ్రహ్మరథోత్సవాన్ని సోమవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయమే అర్చకులు స్వామివారి మూలవిరాట్‌కు ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు చేశారు.

Brahmarathotsavam  ఘనంగా బ్రహ్మరథోత్సవం
రథోత్సవంలో పాల్గొన్న భక్తులు

హిందూపురం, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): మండలంలోని చౌళూరులో చంద్రమౌళేశ్వరి స్వామి బ్రహ్మరథోత్సవాన్ని సోమవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయమే అర్చకులు స్వామివారి మూలవిరాట్‌కు ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు చేశారు.


అనంతరం ప్రత్యేక పూజలు జరిపారు. తర్వాత ఉత్సవమూర్తిని రథంపై కొలువుదీర్చి ఉత్సవాన్ని నిర్వహించారు. పురవీధుల్లో రథం లాగారు. ఆంధ్ర, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లోని భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు. కార్మిక సంఘం నాయకులు రవికుమార్‌ మజ్జిగ పంపిణీ చేశారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Feb 17 , 2026 | 12:36 AM