Home » Sri Satyasai
శ్రీ సత్యసాయి జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి సవిత అన్నారు. కార్ల పరిశ్రమ దగ్గర నుంచి గగన తలంలో ఎగిరే విమానాల పరిశ్రమలు సత్యసాయి జిల్లాకి రావడం ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టమని చెప్పుకొచ్చారు.
మగ్గం నేసే ప్రతి నేతన్నకూ నేతన్నల సేవలో పథకం అందజేస్తామని మంత్రి సవిత స్పష్టం చేశారు. మొదటి విడతలో 71,536 మంది నేతన్నలకు రూ.25 వేల ఆర్థిక సాయం అందించామని తెలిపారు.
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నగర పంచాయతీ ప్రజల తాగునీటి సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెనుకొండ పట్టణానికి తాగునీటి సరఫరా కోసం గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి 0.18 టీఎంసీల నీటిని కేటాయిస్తూ జీవో జారీ అయ్యింది.
హంద్రీనీవా ప్రాజెక్టు పొడవునా ఉన్న చెరువులను ఎమ్మెల్యేలు పరిటాల సునీత, ఎంఎస్ రాజు, ధర్మవరం టీడీపీ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్ పరిశీలించారు. హంద్రీనీవా ప్రాజెక్టు పరిరక్షణ పేరుతో ఆదివారం నాడు ఆ కాలువను వైసీపీ నేతల బృందం పరిశీలించిన విషయం తెలిసిందే.
టీడీపీ మహానాడు కార్యక్రమాన్ని ఈనెల 27, 28 తేదీల్లో వర్చువల్‌గా నిర్వహించనుందని, మండలంలో నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని పార్టీ మండల కన్వీనర్ కృష్ణమూర్తి పిలుపునిచ్చారు.
దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన పట్టణంలోని కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి.
మండలంలోని చినన్నపల్లిలో సోమవారం ఉద యం కొబ్బరిచెట్టుపై పిడుగు పడింది. దీంతో చెట్టు మంటల్లో చిక్కుకుంది. ఉదయం ఓ మోస్తారు వర్షం కురిసింది.
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలేకమ్మ గుడి సమీపంలోని జాతీయ రహదారిపై రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొనడంతో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
గ్రామాల్లో చేపట్టే ఉపాధి హామీ పనులకు కూలీలు అధిక సంఖ్యలో రావాలని ఎంపీడీవో గంగాధర్ తెలిపారు. మండలంలోని జంగమరనహళ్లి, ముక్కడంపల్లి, పూలపల్లి, దాసేగౌడనహళ్లి గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి పనులను గురువారం ఆయన పరిశీలించారు.
త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికలకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు సమాయత్తం కావాలని పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు, ఎమ్మెల్యే పీఏ సురేంద్ర సూచించారు.