Yogi Vemana Jayanti: వేమన నీతి సూత్రాలు సమాజానికి అనుసరణీయం: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Jan 19 , 2026 | 12:09 PM
సామాజిక సంస్కర్త యోగి వేమన జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు ఘన నివాళులర్పించారు. యోగి వేమన జయంతిని అధికారికంగా నిర్వహించడమంటే మనల్ని మనం సన్మార్గంలో నడిపించుకోవడమే అని సీఎం అన్నారు.
అమరావతి, జనవరి 19: ప్రజాకవి, సామాజిక సంస్కర్త యోగి వేమన జయంతిని రాష్ట్ర ప్రభుత్వం(AP Govt) అధికారికంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) యోగి వేమనకు ఘన నివాళులర్పించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. వేమన తన పద్యాల ద్వారా కులమత భేదాలు, మూఢ నమ్మకాలను పారద్రోలిన కృషిని ప్రశంసించారు. ‘విశ్వదాభిరామ వినురవేమా’ అనే నీతి సూత్రాలు ఈనాటి సమాజానికి మార్గదర్శకమని, ఆయన బోధనలు అనుసరణీయమని చంద్రబాబు కొనియాడారు.
చంద్రబాబు ట్వీట్..
‘ప్రజాకవి, సామాజిక సంస్కర్త యోగి వేమన జయంతి సందర్భంగా ఆయనకు ఘననివాళి అర్పిస్తున్నాను. కులమత భేదాలు, మూఢ నమ్మకాలను పారద్రోలేందుకు యోగి వేమన తన పద్యాల ద్వారా చేసిన కృషి ఈనాటి సమాజానికి ఎంతో ఉపయుక్తం. విశ్వదాభిరామ వినురవేమా అంటూ ఆయన చెప్పిన నీతి సూత్రాలు అనుసరణీయం. అలాంటి మహనీయుడి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడమంటే మనల్ని మనం సన్మార్గంలో నడిపించుకోవడమే’ అని ట్వీట్‌లో రాసుకొచ్చారు సీఎం.
మరోవైపు.. వేమన జయంతి సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండలం కటారుపల్లిలోని వేమన సమాధి వద్ద రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. వేలాది మంది విద్యార్థులు ఒకేసారి యోగి వేమన పద్యాలను పఠించి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. యోగి వేమన జయంతి కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు.
ఇవి కూడా చదవండి...
ఆరాంఘర్ చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం
రాజకీయ యాత్ర కాదు.. దేవుడి మొక్కు మాత్రమే: బండ్ల గణేష్
Read Latest AP News And Telugu News